తెలంగాణ

telangana

ETV Bharat / sports

సన్​రైజర్స్​ ఫ్యాన్స్​కు గుడ్​న్యూస్.. వార్నర్ వచ్చేస్తున్నాడు - David Warner IPL

సన్​రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు శుభవార్త చెప్పాడు డేవిడ్ వార్నర్. సెప్టెంబర్​లో ప్రారంభమయ్యే ఐపీఎల్ రెండో దశకు తాను అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.

David Warner
వార్నర్

By

Published : Aug 11, 2021, 1:59 PM IST

Updated : Aug 11, 2021, 2:19 PM IST

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ అభిమానులకు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ శుభవార్త అందించాడు. సెప్టెంబర్‌ 19 నుంచి మొదలుకానున్న ఐపీఎల్‌ 14వ సీజన్‌ రెండో దశ మ్యాచ్​లకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఇన్​స్టా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించాడు. 'ఐ విల్ బి బ్యాక్' అనే క్యాప్షన్​తో సన్​రైజర్స్​ దుస్తులతో ఉన్న ఫొటోను షేర్ చేశాడు. దీంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే నిరవధిక వాయిదా పడిన ఈ ఐపీఎల్​లో ఆడిన ఏడు మ్యాచ్​ల్లో ఆరింటిలో ఓడిపోయింది సన్​రైజర్స్​. వరుస పరాజయాల నేపథ్యంలో వార్నర్​ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తూ​ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కనీసం తుది జట్టులోనూ చోటు ఇవ్వలేదు. కేన్​ విలియమ్సన్​కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. అనంతరం లీగ్ వాయిదా పడగా.. రెండో దశలో వార్నర్ ఆడటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. వాటికి సమాధానంగా తాను ఆడబోతున్నట్లు స్పష్టం చేశాడు వార్నర్.

Last Updated : Aug 11, 2021, 2:19 PM IST

ABOUT THE AUTHOR

...view details