గణేష్ చతుర్థి విషెస్‌తో మనసు దోచేసిన వార్నర్ - క్రికెటర్స్ వినాయక చివితి విషెస్
దేశవ్యాప్తంగా వినాయక చవితి శోభ సంతరించుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని పూజలు చేస్తున్నారు. మన క్రికెటర్లు కూడా సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ వార్నర్ పెట్టిన పోస్ట్ మాత్రం వైరల్‌గా మారింది.
Vinayaka chaviti wishes Warner దేశవ్యాప్తంగా గణనాథుల సందడి ప్రారంభమైంది. ప్రస్తుతం ఆసియా కప్ వేటలో ఉన్న టీమ్‌ఇండియా ఆటగాళ్లు కూడా వినాయకుడిని ప్రార్థిస్తూ సోషల్‌మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. అయితే ఇదంతా ఒకటైతే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం వినాయక చవితి శుభాకాంక్షలు తెలపడం విశేషం. ఎందుకంటే అతడు గణపతి విగ్రహం ముందు దండం పెడుతున్న ఒక ఫొటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో వైరల్‌గా మారింది. 'జై బోలో గణేష్ మహరాజ్‌కి' అంటూ నెటిజన్లు వార్నర్ పోస్టుకు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ సారి అతడి పోస్ట్‌తో పాటు మిగతా మన క్రికెటర్లు ఏమని పోస్లు పెట్టారో చూసేద్దాం..