Virat Kohli Warner: క్రికెట్‌లో ఎంతటి ఆటగాడైనా కొన్ని సమయాల్లో ఫామ్ కోల్పోవడం సహజం. ఆ ఫామ్ అందుకోవడానికి నానా తంటాలూ పడటమూ సహజమే. ప్రస్తుతం టీమ్ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ కూడా అదే స్టేజ్‌లో ఉన్నాడు. అయితే విరాట్ మరికొద్ది రోజుల్లోనే ఫామ్‌లోకి వస్తాడని ఎంతో మంది మాజీలు, సహచర ఆటగాళ్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పుడు ఆస్ట్రేలియా ఆటగాడు, దిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్.. విరాట్‌కు ఓ సలహా ఇచ్చాడు. యూట్యూబ్ ఛానెల్ స్పోర్ట్స్ యారీతో మాట్లాడిన వార్నర్.. విరాట్‌కు కాస్త ఫన్నీ అడ్వైజ్ ఒకటి ఇచ్చాడు. ప్రతి ప్లేయర్ తన క్రీడా జీవితంలో ఇలాంటి దశను ఎదుర్కొంటాడని, దీనిని పెద్దగా సీరియస్‌గా తీసుకోవద్దని తెలిపాడు. అంతేకాదు మరో ఇద్దరు పిల్లలను కనమని కూడా చెప్పాడు.