తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కోహ్లీ, ధోనీ.. నాకు ఇష్టమైన క్రికెటర్లు' - ipl news

రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్.. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. ఈ క్రమంలో పలు ఆసక్తకర విషయాల్ని పంచుకున్నాడు. తనకు ఇష్టమైన క్రికెటర్లు కోహ్లీ, ధోనీ అని వెల్లడించాడు.

KOHLI, DHONI
కోహ్లీ

By

Published : Jun 2, 2021, 10:06 PM IST

Updated : Jun 2, 2021, 10:23 PM IST

ప్రస్తుత క్రికెటర్లలో టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ తనకు ఇష్టమైన ఆటగాడని దక్షిణాఫ్రికా హిట్టర్‌ డేవిడ్‌ మిల్లర్‌ అన్నాడు. అతడి బ్యాటింగ్‌ అద్భుతంగా ఉంటుందని ప్రశంసించాడు. తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఎంఎస్‌ ధోనీ ఒకరని తెలిపాడు. ట్విటర్లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు అతడు జవాబులిచ్చాడు.

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ప్రస్తుత సీజన్లో డేవిడ్‌ మిల్లర్‌ రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడాడు. రెండు మ్యాచుల్లో విలువైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఐదు మ్యాచులాడి 88 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 62. గతంలో అతడు పంజాబ్‌కు ఆడాడు. ఒకప్పుడు అతడు భారీ షాట్లతో సంచలనాలు సృష్టించాడు. ఈ మధ్య కాలంలో అలాంటి మెరుపులు మెరిపించలేకపోతున్నాడు. ఖాళీ సమయం దొరకడం వల్ల 'ఆస్క్‌ మిల్లర్' పేరుతో ట్విటర్లో అభిమానులతో ముచ్చటించాడు.

డేవిడ్ మిల్లర్

* ప్రస్తుత క్రికెటర్లలో మీకెవరు ఇష్టం?

ఇంకెవరు.. విరాట్‌ కోహ్లీ

* ఎంఎస్‌ ధోనీ గురించి కొన్ని మాటల్లో..

నాకిష్టమైన క్రికెటర్లలో ఒకరు. నేను చూసిన అత్యుత్తమ ఫినిషర్‌. అణకువగా ఉంటాడు. అతడి ప్రశాంత స్వభావం నాకిష్టం.

* భారత అభిమానుల గురించి?

ఎక్కువ ప్రేమిస్తారు!

* రాబోయే యూరో2020లో ఎవరికి మద్దతిస్తారు?

స్పెయిన్‌.. మరి మీ సంగతేంటి అడ్మిన్‌ (రాజస్థాన్‌ రాయల్స్‌)

* ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఫీల్డర్‌ ఎవరు?

నేనే..

* ఎక్కువగా పిలిచే పొట్టిపేరు ఏంటి?

డేవ్

* భారత క్రికెటర్లలో మీ మిత్రులు ఎవరు?

ఒక్కరు కాదు చాలామంది ఉన్నారు! మణ్‌దీప్‌, అనుజ్‌ రావత్‌, రాహుల్‌ తెవాతియా.. ఈ జాబితా పెరుగుతూనే ఉంటుంది..

* రాజస్థాన్‌ రాయల్స్‌లో ఎవరితో ఎక్కువగా గడిపారు?

అందరితో...

* క్రికెట్‌ కాకుండా ఆడాలనుకొనే ఇతర క్రీడలు

టెన్నిస్‌.. గోల్ఫ్‌

Last Updated : Jun 2, 2021, 10:23 PM IST

ABOUT THE AUTHOR

...view details