Dansuh Gunathilaka Rape Case :అత్యాచార ఆరోపణలను ఎదుర్కొంటున్న శ్రీలంక క్రికెటర్ దనుష్క గుణతిలక.. ఎట్టకేలకు ఆ కేసు నుంచి బయటపడ్డాడు. గతేడాది టీ20 ప్రపంచ కప్ సమయంలో ఆస్ట్రేలియా మహిళపై అతడు అత్యాచారం చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలు సంచలనం రేపాయి. దీంతో ఆసీస్ పోలీసు అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఆ అత్యాచారయత్న ఆరోపణలను కొట్టి పారేస్తూ తాజాగా ఆస్ట్రేలియా కోర్టు తీర్పునిచ్చింది. ఫలితంగా కేసు నుంచి గుణతిలక నిర్దోషిగా బయటపట్టాడు.
తాను నిర్దోషిగా తేలడం వల్ల ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న గుణతిలక ఆనందం వ్యక్తం చేశాడు. అన్నింటికీ తీర్పే సమాధానం ఇచ్చిందని పేర్కొన్నాడు. "అన్నింటికీ తీర్పే సమాధానం ఇచ్చింది. ఇక నుంచి నా జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా గడుపుతాను. లంక తరఫున క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. తప్పకుండా నేషనల్ టీమ్‌లోకి వస్తాను" అని గుణతిలక అన్నాడు. కాగా, శ్రీలంక తరఫున వందకు పైగా ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు(danushka gunathilaka career) ఆడిన గుణతిలక... అత్యాచార ఆరోపణలలలో అరెస్ట్ అయిన నేపథ్యంలో అతడి సస్పెండ్ చేస్తూ ఆ దేశ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అతడు నిర్దోషిగా తేలడంతో తిరిగి జాతీయ జట్టులోకి అతడు వెళ్లే అవకాశముంది.