దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు స్పష్టం చేశాడు. ఇప్పటికే టెస్టు క్రికెట్‌కు దూరమైన ఈ స్టార్ పేసర్ తాజాగా అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పేశాడు. దీంతో ఓ దిగ్గజ ఆటగాడిని ఇకపై మైదానంలో చూడలేమంటూ కామెంట్లు పెడుతూ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
స్టార్ పేసర్ డేల్ స్టెయిన్ రిటైర్మెంట్ - క్రికెటర్ డేల్ స్టెయిన్ రిటైర్మెంట్
15:57 August 31
"ట్రైనింగ్, మ్యాచ్‌లు, ట్రావెల్, విజయాలు, ఓటములు, గాయాలతో 20 ఏళ్లు గడిచిపోయాయి. ఈ సమయంలో అద్భుత జ్ఞాపకాలు సంపాదించా. చాలామందికి ధన్యవాదాలు తెలపాలి. ఇక నేను నా కెరీర్‌ను ముగిస్తున్నా. అధికారికంగా ఆట నుంచి రిటైర్ అవుతున్నా. నా ఈ ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు, సహ ఆటగాళ్లు, జర్నలిస్టులు, అభిమానులు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు."
-స్టెయిన్, దక్షిణాఫ్రికా క్రికెటర్
ఐపీఎల్లో 95 మ్యాచులు ఆడిన స్టెయిన్.. 6.91ఎకానమీతో 97 వికెట్లు పడగొట్టాడు. గతేడాది టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఇతడు.. టెస్టు కెరీర్లో 439 వికెట్లు దక్కించుకున్నాడు.