Common Wealth Games 2022: కామన్వెల్త్ క్రీడల్లో భారత మహిళల క్రికెట్ జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. కీలకపోరులో బార్బడోస్‌ను చిత్తు చేసింది. పాకిస్థాన్‌ను బెంబేలెత్తించింది. ఆస్ట్రేలియాకు చెమటలు పట్టించింది. అయితే, ఇవన్నీ జరిగాయంటే ప్రధాన కారణం మాత్రం... రేణుకా సింగ్ ఠాకూర్. ఎందుకంటే ఆమె ఈ టోర్నీలో లీడింగ్ వికెట్ టేకర్ (9), భారత్‌కు పవర్‌ప్లేలో గేమ్ ఛేంజర్.
తొలి మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినా..రేణుకా సింగ్ బౌలింగ్ మాత్రం అంత తేలికగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే అలిస్సా హీలీ, బెత్ మూనీ, మెగ్ లానింగ్, తహ్లియా మెక్‌గ్రాత్ ఇలా అగ్రశ్రేణి బ్యాటర్లను పెవిలియన్‌కు పంపింది. ఇక రెండో మ్యాచ్‌లో పాక్‌పై పొదుపు బౌలింగ్ చేసి కట్టడి చేసింది. భారత్‌కు చావోరేవో తేల్చుకోవాల్పిన మ్యాచ్‌లో బార్బడోస్ బ్యాటర్లను చుట్టేసింది. పవర్‌ప్లేలో 3 ఓవర్లు వేసి కేవలం ఐదు పరుగులు ఇచ్చి మూడు కీలకవికెట్లు పడగొట్టింది.
కామన్వెల్త్ గేమ్స్‌లో రేణుకా ప్రదర్శన
- 4-0-18-4 (ఆస్ట్రేలియా పై)
- 4-1-20-1 (పాకిస్థాన్‌పై)
- 4-0-10-4 (బార్బడోస్)