తెలంగాణ

telangana

By

Published : Jun 26, 2023, 8:06 PM IST

ETV Bharat / sports

జింబాబ్వే సంచలన విజయం.. వన్డేల్లో అత్యధిక తేడాతో గెలిచిన రెండో జట్టుగా..

CWC Qualifiers 2023 : ఐసీసీ ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో జింబాబ్వే చరిత్ర సృష్టించింది. భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ వివరాలు..

Zimbambwe
జింబాబ్వే సంచలన విజయం.. వన్డేల్లో అత్యధిక తేడాతో గెలిచిన రెండో జట్టుగా..

CWC Qualifiers 2023 : ఐసీసీ ప్రపంచ కప్‌ క్వాలిఫయర్స్‌-2023లో జింబాబ్వే భారీ విజయాన్ని నమోదు చేసింది. హరారే వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో యూఎస్‌ఏ జట్టును ఏకంగా 304 పరుగుల తేడాతో మట్టికరిపించింది. ఫలితంగా వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించిన రెండో జట్టుగా నిలిచింది. అంతకుముందు టీమ్​ఇండియా మొదటి స్థానంలో నిలిచింది.

మ్యాచ్ సాగిందిలా.. ఇప్పటికే సూపర్‌ సిక్సెస్‌లో.. వన్డే ప్రపంచకప్​-2023 క్వాలిఫయర్స్‌లో ఇప్పటికే సూపర్‌ సిక్సెస్‌కు అర్హత సాధించింది జింబాబ్వే. అయితే నేడు(జూన్‌ 26) యూఎస్‌ఏతో నామ మాత్రపు మ్యాచ్‌లో పోటీ పడింది. ఈ మ్యాచ్​లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే.. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఏకంగా 408 పరుగుల భారీ స్కోరు చేసింది.

కెప్టెన్‌ ఊచకోత..కెప్టెన్‌ సీన్‌ విలియమ్స్‌ 101 బంతుల్లో ఏకంగా 21x4, 5x6 సాయంతో తుఫాను ఇన్నింగ్స్​ ఆడాడు. 174 పరుగులు చేశాడు. ఓపెనర్‌ గుంబీ (78), సికందర్‌ రజా(48), రియాన్‌ బర్ల్‌(47) పరుగులతో రాణించారు. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన యూఎస్‌ఏ.. జింబాబ్వే బౌలర్ల దెబ్బకు 104 పరుగులకే కుప్పకూలింది. యూఎస్‌ఏ బ్యాటర్లలో 6,9,8,13,0,24,2,21,6,0 తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరారు. అలా బ్యాటర్లంతా వరుసగా విఫలం అవ్వడం వల్ల యూఎస్‌ఏ 304 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. వన్డేల్లో అత్యధిక తేడాతో ప్రత్యర్థి జట్టును ఓడించి చరిత్ర సృష్టించింది. ఇక కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన జింబాబ్వే సారథి సీన్‌ విలియమ్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు.

మొదటి స్థానంలో టీమ్​ఇండియా.. ఈ విజయంతో జింబాబ్వే ఓ అరుదైన రికార్డును సృష్టించింది. యూఎస్‌ఏపై సంచలన విజయాన్ని అందుకుని వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో ప్రత్యర్థిని ఓడించిన రెండో జట్టుగా నిలిచింది. మేటి జట్లన్నింటినీ వెనక్కి నెట్టి టీమ్​ఇండియా తర్వాతి స్థానాన్ని దక్కించుకుంది.

  • వన్డేల్లో అత్యధిక పరుగుల తేడాతో నమోదైన విజయాలు ఇవే..
  • 2023 - తిరువనంతపురం - శ్రీలంకపై భారత్‌ - 317 పరుగుల తేడాతో
  • 2023 - హరారే - యూఎస్‌ఏపై జింబాబ్వే - 304 పరుగుల తేడాతో
  • 2008 - అబెర్డీన్‌ - ఐర్లాండ్​పై న్యూజిలాండ్‌ - 290 పరుగుల తేడాతో
  • 2015 - పెర్త్‌ - అప్ఘానిస్థాన్‌పై ఆస్ట్రేలియా - 275 పరుగులు
  • 2010 - బెనోని - జింబాబ్వేపై సౌతాఫ్రికా - 272 పరుగుల తేడాతో

ఇదీ చూడండి :

వనిందు హసరంగ సూపర్ రికార్డ్​.. వరుసగా 3 మ్యాచ్‌ల్లో ఐదేసి వికెట్లు

ICC ODI World cup 2023 : వన్డే ప్రపంచకప్​పై ఐసీసీ కీలక అప్డేట్​.. ​

ABOUT THE AUTHOR

...view details