CWC Qualifier 2023 : ప్రపంచ కప్ క్వాలిఫయర్స్ 2023 ప్రస్తుతం జరుగుతున్నాయి. అయితే ఈ టోర్నీలో తాజాగా శ్రీలంక స్పిన్నర్ వనిందు హసరంగ రికార్డు సృష్టించాడు. ఐర్లాండ్‌తో నేడు(జూన్ 25) జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతడు.. వరుసగా మూడు వన్డేల్లో 5 లేదా అంతకన్నా ఎక్కువ వికెట్లు(16 వికెట్లు) తీసిన రెండో బౌలర్‌గా ఘనత సాధించాడు. గతంలో పాకిస్థాన్ స్పీడ్‌స్టర్ వకార్ యూనిస్ మాత్రమే వన్డేల్లో ఇలా హ్యాట్రిక్ ఫైఫర్స్(15 వికెట్లు) మార్క్‌ను అందుకున్నాడు.
wanindu hasaranga best bowling figures : ఈ టోర్నీలో యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ఆరు(8-1-24-6) వికెట్లు తీసిన హసరంగ.. ఆ తర్వాత ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఐదు(7.2-2-13-5) వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు తాజాగా ఐర్లాండ్‌పై మరోసారి ఐదు(10-0-79-5) వికెట్ల ప్రదర్శన చేశాడు. ఈ తాజా మ్యాచ్‌లో హసరంగ మంచిగా రాణించడం వల్ల ఐర్లాండ్‌పై శ్రీలంక 133 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. గ్రూప్-బీ నుంచి సూపర్ సిక్స్‌కు చేరిన మొదటి టీమ్‌గా నిలిచింది. మరోవైపు ఈ మ్యాచ్‌లో ఓటమితో ఐర్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక గ్రూప్-బీ నుంచి శ్రీలంకతో పాటు స్కాట్లాండ్, ఒమన్‌లు టీమ్స్ కూడా సూపర్ సిక్స్‌కు అర్హత సాధించాయి. గ్రూప్-ఏ నుంచి జింబాబ్వే, నెదర్లాండ్స్, వెస్టిండీస్ సూపర్ సిక్స్‌కు వెళ్లాయి.
Ireland vs Sri lanka 2023 : ఇక తాజాగా జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో శ్రీలంక 133 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.5 ఓవర్లలో 325 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణరత్నే(103) సెంచరీతో విజృంభించగా.. సదీర సమరవీర (82) హాఫ్ సెంచరీతో రాణించాడు. చరిత్ అసలంక(38), ధనంజయ డిసిల్వ (42*) పర్వాలేదనిపించారు. ఐర్లాండ్ బౌలర్లలో మార్క్ అదైర్ 4, బ్యారీ మెక్‌కార్తీ 3, గెరత్ డెలానీ 2 వికెట్లు దక్కించుకున్నారు.