అబుదాబి వేదికగా ఐర్లాండ్-నెదర్లాండ్స్(ire vs ned t20) మధ్య టీ20 ప్రపంచకప్-2021(T20 world cup 2021) క్వాలిఫయింగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 106 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టు పతనంలో ఐర్లాండ్ బౌలర్ కర్టిస్ కాంఫర్(curtis campher t20) కీలకపాత్ర పోషించాడు. నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసి.. టీ20ల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు.
10వ ఓవర్ వేసిన కాంఫర్(curtis campher t20).. ఈ ఓవర్లో వరుసగా ఆక్‌మన్ (11) టెన్ డచ్టే (0), స్కాట్ ఎడ్వర్డ్స్ (0), వాన్‌డర్ మెర్వ్(0)లను పెవిలియన్ పంపాడు. దీంతో టీ20ల్లో నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా ఘనత సాధించాడు కాంఫర్. ఇంతకుముందు లంక పేసర్ మలింగ (2007 టీ20 ప్రపంచకప్, 2019లో న్యూజిలాండ్‌తో టీ20) రెండుసార్లు ఈ ఘనత సాధించాడు. ఆ తర్వాత అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్.. 2019లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వరుసగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.