Subhranshu Senapati CSK: ఐపీఎల్లో నాలుగు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్.. వచ్చే సీజన్‌కు సమయాత్తమవుతోంది. ఇప్పటికే నలుగురు ప్లేయర్లను రిటెయిన్ చేసుకున్న సీఎస్కే యాజమాన్యం కొత్త ఆటగాళ్ల కోసం వేట ప్రారంభించింది. ఈ క్రమంలో ఒడిశా బ్యాటర్ సుభ్రాంశు సేనాపతికి ఆహ్వానం పలికింది. ట్రయల్స్‌కు రావాలని పిలిచింది.
Subhranshu Senapati IPL Team:
విజయ్ హజారే ట్రోఫీ 2021 లో ఆంధ్రప్రదేశ్‌తో మ్యాచ్‌తో ఈ ఒడిశా కుర్రాడు వెలుగులోకి వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఒడిశాకు గెలవడంలో అతని బ్యాటింగ్‌పై ప్రశంసలు అందుకుంది. కేవలం ఏడు మ్యాచ్‌ల్లోనే 257 పరుగులు సాధించాడు. అంతేకాకుండా విదర్భ, హిమాచల్ ప్రదేశ్‌లపై సునాయసంగా ఆఫ్ సెంచరీలు చేశాడు. టీ20ల్లో 637 రన్స్‌తో సరాసరి 28.95ను కలిగి ఉన్నాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో ఐదు మ్యాచ్‌ల్లోనే 138 రన్స్ సాధించాడు. 116.94 స్ట్రైక్ రేట్‌ను కలిగి ఉన్నాడు. ఇతని ఆటతీరుకు మెచ్చి ట్రయల్స్‌కు రావాలని పిలిచింది సీఎస్కే.
"విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ మస్తాక్ అలీ ట్రోఫీలో సేనాపతి ఆటతీరే అతనికి సీఎస్కే ఆహ్వానానికి కారణం."
- సంజయ్ బెహేరా, ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (ఓసీఏ)