తెలంగాణ

telangana

ETV Bharat / sports

నీరజ్‌ చోప్రాకు సీఎస్‌కే స్పెషల్‌ జెర్సీ, రూ.కోటి నజరానా

టోక్యో ఒలింపిక్స్​లో స్వర్ణంతో మెరిసిన జావెలిన్ త్రో అథ్లెట్ నీరజ్ చోప్రా(neeraj chopra tokyo olympics)కు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. గతంలో ప్రకటించినట్లుగా ఐపీఎల్ ఫ్రాంచైజీ సీఎస్​కే.. నీరజ్​కు రూ.కోటితో పాటు స్పెషల్ జెర్సీ(neeraj chopra csk jersey)ని అందించింది.

Neeraj Chopra
నీరజ్‌ చోప్రా

By

Published : Nov 1, 2021, 7:41 AM IST

టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా(neeraj chopra tokyo olympics)కు బహుమతుల వెల్లువ కొనసాగుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర తను ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ప్రత్యేకంగా రూపొందించిన జావెలిన్‌ ఎడిషన్‌ 'ఎక్స్‌యూవీ 700' వాహనాన్ని నీరజ్‌ చోప్రాకు పంపించారు. తాజాగా.. ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) కూడా గతంలో ప్రకటించినట్లుగా రూ.కోటి నగదు బహుమతిని నీరజ్‌కు అందజేసింది. అంతేకాదు.. సీఎస్‌కే స్పెషల్‌ జెర్సీని(neeraj chopra csk jersey) బహుకరించింది. టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్‌ జావెలిన్‌ త్రో రికార్డు.. 87.58మీటర్లను సంఖ్యగా మార్చి జెర్సీపై 8758 నంబర్‌ను ముద్రించి ఇచ్చారు. ఈ జెర్సీ, నగదు బహుమతిని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ దిల్లీలో నీరజ్‌కు అందజేశారు.

ఈ సందర్భంగా నీరజ్‌(neeraj chopra tokyo olympics) మాట్లాడుతూ.. "స్వర్ణం గెలిచిన తర్వాత నాపై ఇంత ప్రేమ కురుస్తుందని నేను ఊహించలేదు. కానీ.. ఇది ఎంతో సంతోషంగా అనిపిస్తుంది. మీ మద్దతు.. బహుమతులకు ధన్యవాదాలు. రెండు నెలలుగా ప్రకటనల షూటింగ్స్‌, క్రీడారంగంలో ప్రముఖుల అభినందనలతో బిజిబిజీగా గడుస్తోంది. అలాగే కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తోంది. ఇకపై నేను మరింత కష్టపడతాను. మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తాన"’అని తెలిపాడు.

దేశం గర్విస్తోంది: విశ్వనాథన్‌

నీరజ్‌(neeraj chopra tokyo olympics)కు స్పెషల్‌ జెర్సీని అందజేయడం ఎంతో ఆనందంగా ఉందని సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్‌ తెలిపారు. "నీరజ్‌ చోప్రా సాధించిన విజయం పట్ల యావత్‌ దేశం గర్వపడుతోంది. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్‌ చరిత్ర సృష్టించాడు. అలాగే రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలిచాడు. జావెలిన్‌ త్రోలో నీరజ్‌ సాధించిన 87.58 రికార్డు భారత క్రీడా చరిత్రలో మరపురాని ఘట్టంగా నిలిచిపోతుంది. నీరజ్‌ దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలి" అని విశ్వనాథన్‌ అన్నారు.

ఇవీ చూడండి: ఇది మన జట్టేనా?.. ఆ కసి, పట్టుదల ఏమయ్యాయో?

ABOUT THE AUTHOR

...view details