తెలంగాణ

telangana

ETV Bharat / sports

CSKకు ఊహించని షాక్​.. ధోనీకి గాయం.. ఫస్ట్ మ్యాచ్​కు డౌటే! - dhoni injured

చెన్నై సూపర్ కింగ్స్​ కెప్టెన్ ధోనీకి గాయమైనట్లు తెలిసింది. దీంతో అతడు తమ జట్టు ఆడబోయే తొలి మ్యాచ్​కు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

CSK captain Dhoni ruled out of first match in IPL 2023
IPL 2023: సీఎస్కేకు ఊహించని షాక్​.. ధోనీకి గాయం!

By

Published : Mar 30, 2023, 7:46 PM IST

Updated : Mar 30, 2023, 8:46 PM IST

ఇంకొక్క రోజులో భారత్​లో క్రికెట్ పండగ సంబరం మొదలుకానున్న సంగతి క్రికెట్​ అభిమానులకు తెలిసిన విషయమే. మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ అట్టహాసంగా ఆరంభంకానుంది. చాలా రోజులుగా ఈ మెగాటోర్నీ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్​. తమ అభిమాన ఆటగాళ్లు బ్యాట్​తో మెరుపులు, బౌలింగ్​లతో మ్యాజిక్​లు చేస్తుంటే చూసి ఎంజాయ్​ చేయాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఈ మెగాటోర్నీకి కొద్ది రోజుల ముందే నుంచే గాయాల బెడద తీవ్రంగా వేధిస్తోంది. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడుతూ.. సీజన్​లోని కొన్ని మ్యాచ్​లకు లేదంటే పూర్తి టోర్నీకి దూరమవుతున్నారు. దీంతో అభిమానులు తెగ ఆందోళన చెందుతున్నారు. ఫ్రాంచైజీలు కూడా తలలు పట్టుకుంటున్నాయి. ఎవరిని ఆడించాలి? తుది జట్టులో ఎవరిని బరిలోకి దింపాలి? ప్రత్యర్థులను ఎలా మట్టికరిపించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి.

ఈ నేపథ్యంలోనే మెగాటోర్నీకి ఇంకొక్క రోజు మిగిలి ఉండగానే.. చెన్నై సూపర్​ కింగ్స్​కు భారీ షాక్ తగిలేలా ఉంది. సీఎస్కే కెప్టెన్ ధోనీ గాయపడినట్లు తెలుస్తోంది. నెట్స్​లో ప్రాక్టీస్​ చేస్తుండగా.. అతడి ఎడమ కాలికి బంతి బలంగా తాకిందట. దీంతో మహీని చికిత్సకు పంపించారని తెలిసింది. దీంతో మార్చి 31న గుజరాత్ టైటాన్స్​తో జరగబోయే ఫస్ట్​ మ్యాచ్​కు అతడు అందుబాటులో ఉండేది అనుమానంగా మారింది. ఇక ఈ విషయం తెలుసుకున్న మహీ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. మహీకి నిజంగానే గాయమైందా? కేవలం తొలి మ్యాచ్ కు మాత్రమే దూరం అవుతాడా? లేదంటే మిగతా మ్యాచులు కూడానా? అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే మహీ గాయంపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు. ఒక వేళ నిజంగానే ధోనీ మ్యాచ్​కు దూరమైతే అతడి స్థానంలో బెన్‌స్టోక్స్ లేదా రుతురాజ్ గైక్వాడ్ సారథిగా వ్యవహరించే అవకాశముంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.. కాగా, ఈ క్యాష్ రిచ్​ లీగ్​లో ఇప్పటికే దిల్లీ కెప్టెన్​ పంత్, ముంబయి ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, కేకేఆర్ సారథి శ్రేయస్ అయ్యర్​.. గాయాల కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్నారు. వీరితో పాటు ఇంకొంతమంది ప్లేయర్స్​ కూడా దూరమయ్యారు.

ధోనీని ఊరిస్తున్న రికార్డులు.. ఐపీఎల్లో ధోనీ షాట్లు కొడితే ఫ్యాన్స్​కు వచ్చే ఊపు అంతా ఇంతా కాదు. అతడు తనదైన స్టైల్​లో సిక్సర్లు బాదుతూ మైదానాన్ని హోరెత్తిస్తుంటాడు. ఇప్పటివరకు ఈ మెగాటోర్నీలో 229 సిక్సర్లను బాది.. అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో 21 సిక్సర్లు బాదితే.. ఈ మెగాలీగ్​లో 250 సిక్సర్లు బాదిన ఆటగాడిగా నిలుస్తాడు. అలాగే ఈ మెగాటోర్నీలో అత్యధిక మ్యాచులు ఆడిన ప్లేయర్​ మహీనే. ఇప్పటి వరకు 234 మ్యాచులు ఆడిన అతడు.. ఇంకో 16 ఆడితే 250 మార్క్​కు చేరుకుంటాడు. ఇంకా అతడు ఇప్పటి వరకు 206 ఇన్నింగ్స్​లో 4,978 రన్స్ సాధించాడు. మరో 22 పరుగులు సాధిస్తే.. 5 వేల పరుగులు మార్క్​ను అందుకుంటాడు.

ఇదీ చూడండి:ఐపీఎల్​ 2023లో ఈ టాప్​-5 బ్యాటర్స్​ చెలరేగుతారా?

Last Updated : Mar 30, 2023, 8:46 PM IST

ABOUT THE AUTHOR

...view details