తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఐపీఎల్​లో నాకు కొవిడ్ ఎలా సోకిందంటే..' - ఐపీఎల్ట

ఐపీఎల్ సందర్భంగా తనకు కరోనా ఎలా సోకిందనే విషయాన్ని వెల్లడించాడు చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్​ మైకేల్ హస్సీ. సన్​రైజర్స్​తో మ్యాచ్​ రోజున బబుల్​ నుంచి తాను బయటకు రావడం ఓ కారణమని తెలిపాడు.

Mike Hussey, CSK batting coach
మైకేల్ హస్సీ, చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ కోచ్a

By

Published : May 19, 2021, 5:50 PM IST

ఐపీఎల్​ సందర్భంగా కరోనా బారిన పడిన చెన్నై సూపర్ కింగ్స్​ బ్యాటింగ్ కోచ్​ మైకేల్ హస్సీ.. ఇటీవలే కోలుకున్నాడు. అయితే తనకు కొవిడ్ ఎలా సోకిందనే విషయాన్ని వివరించాడు హస్సీ.

"ఏప్రిల్​ 28న దిల్లీ వేదికగా సన్​రైజర్స్​తో జరగనున్న మ్యాచ్​ రోజున తాను బబుల్​ నుంచి బయటకు వచ్చినట్లు హస్సీ వెల్లడించాడు. అక్కడ మైదానంలో గ్రౌండ్ సిబ్బందితో పాటు మరికొందరు ఉన్నారని తెలిపాడు. "నిజం చెప్పాలంటే బబుల్ నుంచి బయటకు రావడం చాలా ప్రమాదం. ఆ తర్వాత వైరస్​కు సంబంధించి లక్షణాలు కొన్ని నాకు కనిపించాయి. కొవిడ్ సోకిందని నాకప్పటికే అనిపించింది. తర్వాతి రోజు బస్సులో ప్రయాణించేటప్పుడు బౌలింగ్ కోచ్ బాలాజీ పక్కన కొన్ని సార్లు కూర్చున్నాను. దీంతో బాలాజీకి కూడా నా ద్వారా కరోనా అంటుకునే అవకాశాలు ఉన్నాయి" అని హస్సీ పేర్కొన్నాడు.

ఆరంభం నుంచి 29 మ్యాచ్​ల వరకు సాఫీగా సాగింది ఐపీఎల్. తర్వాత ఆరుగురు ప్లేయర్లతో పాటు ఇద్దరు సహాయక సిబ్బంది, ఓ బస్ క్లీనర్​కు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. దీంతో టోర్నీని వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. ​

ఇదీ చదవండి:డబ్ల్యూటీసీ మ్యాచ్​ రద్దైతే పరిస్థితి ఏంటి?

ABOUT THE AUTHOR

...view details