క్రికెట్లో(knight vs titans2021) అప్పుడప్పుడు విచిత్ర, హాస్య, అద్భుత సంఘటనలు జరుగుతుంటాయి. సీఎస్ఏ ప్రొవిన్షియల్ టీ20 కప్ 2021లో(csa provincial t20 cup 2021 schedule) భాగంగా నేడు(సెప్టెంబరు 28) నైట్స్, టైటన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లోనూ ఇలాంటి ఓ విచిత్ర సంఘటనే చోటు చేసుకుంది. 'ఇలా కూడా ఔట్ అవుతారా?' అనేలా నవ్వులు పూయించిందీ సన్నివేశం.
నైట్స్ జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. టైటన్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఈ క్రమంలోనే ఇన్నింగ్స్ చివర్లో క్లీజులోకి వచ్చిన ఆల్‌రౌండర్ అయాబులేలా జి కమేన్( Ayabulela Gqamane) అందరి దృష్టినీ ఆకర్షించాడు. 19 ఓవర్లో వైడ్‌బాల్‌ను ఆఫ్‌సైడ్ మీదగా ఆడబోయి అనుకోకుండా ఆఫ్ స్టంప్‌ను బ్యాట్‌తో గట్టిగా బాదాడు. దీంతో ఆ వికెట్ గాల్లో ఎగురుతూ పల్టీలు కొట్టింది. ఇతడు ఔట్ అయిన తీరు ప్రేక్షకులను నవ్వించింది. దీనికి సంబంధించిన వీడియోను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ట్వీట్ చేయగా నెట్టింట్లో వైరల్‌గా మారింది. 'ఔట్ అవ్వడంలో అతడు కొత్త మార్గాన్ని కనుగొన్నాడు. ఔట్ అవ్వడంలో అత్యంత దారుణమైన పద్ధతి ఇదేనా?' అని వ్యాఖ్య జోడించింది.