ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా దిల్లీ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టస్టు జరుగుతోంది. అయితే, ఓవర్ నైట్ స్కోర్ 21/0తో రెండో రోజు ఆటను మొదలు పెట్టిన టీమ్‌ఇండియా కష్టాల్లో పడింది. భారత ఓపెనర్లు రోహిత్(32), రాహుల్(17) తక్కువ స్కోర్‌కే పెవిలియన్ చేరారు. సూర్య స్థానంలో వచ్చిన అయ్యర్ 4 పరుగులకే వెనుదిరిగాడు. వీరంతా లయోన్ బౌలింగ్‌లోనే ఔటయ్యారు. లంచ్ బ్రేక్ సమయానికి 35 ఓవర్లు ఆడిన భారత్ 88/4 స్కోర్ చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌కు భారత్.. ఇంకా 175 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం క్రీజులో జడేజా(15*), విరాట్ కోహ్లీ(14*) ఉన్నారు.
నిరాశపరిచిన పుజారా..
టీమ్‌ఇండియా 'నయావాల్' ఛెతేశ్వర్ పుజారా.. తన వందో మైలురాయి టెస్టులో నిరాశ పర్చాడు. 19.4 ఓవర్లో లయోన్ వేసిన బౌలింగ్‌లో.. బంతి పుజారా ప్యాడ్‌కు తగిలింది. దీంతో లయోన్ ఔట్ అప్పీల్ చేశాడు. కానీ, అంపైర్ నితిన్ మీనన్ ఔట్ ఇవ్వలేదు. దీంతో ఆసీస్ జట్టు తన చివరి రివ్యూను కోరింది. అనంతరం థర్డ్ అంపైర్ పరిశీలించి.. బంతి బ్యాట్ కన్నా ముందు ప్యాడ్‌కు తగిలిందని నిర్ధరించి ఔట్ ఇచ్చాడు. ఒక్క పరుగు కూడా చేయకుండానే పుజారా డకౌట్ అయ్యాడు.