తెలంగాణ

telangana

ETV Bharat / sports

సూర్యతో పాటు ఆ ఇద్దరికి ప్రమోషన్​.. రహానె, ఇషాంత్​కు షాకిచ్చిన బీసీసీఐ - శుభమన్ గిల్ సెంట్రల్​ కాంట్రాక్ట్​

భారత క్రికెట్‌ ఆటగాళ్ల భవతవ్యాన్ని నిర్దేశించే బీసీసీఐ అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ డిసెంబర్‌ 21న నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో 12 ప్రధానాంశాలను అజెండాపై బీసీసీఐ దృష్టి సారించనుంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌ ఆధారంగా క్రికెటర్లకు గ్రేడ్‌లు ఇవ్వడంతో పాటు జెర్సీ, కిట్‌ స్పాన్సర్లపై చర్చలు జరగనున్నాయి. అజింక్యా రహానే, ఇషాంత్‌ శర్మలను వార్షిక సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌లను తొలగించనున్నట్లు తెలుస్తోంది.

.
.

By

Published : Dec 12, 2022, 4:36 PM IST

భారత ఆటగాళ్ల భవతవ్యాన్ని నిర్దేశించే వార్షిక అపెక్స్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ ఈ నెల 21న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరగనుంది. ఇందులో 2022-23సీజన్లకు సంబంధించిన లిస్ట్‌పై తుది నిర్ణయం తీసుకోనున్నారు. అజింక్యా రహానే, ఇషాంత్‌ శర్మలకు సెంట్రల్‌ కాంట్రాక్ట్స్‌ల నుంచి తొలగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుభమన్​ గిల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లకు ప్రమోషన్‌లు దక్కే అవకాశం కనిపిస్తోంది.గ్రూప్‌-సీలో ఉన్న హార్దిక్‌ పాండ్య గ్రూప్‌-బీలోకి చేరడంతో పాటు టీ20కు సారథ్యం వహించనున్నట్లు తెలుస్తోంది. స్టంపర్‌ బ్యాటర్‌ వృద్ధిమాన్‌ సాహను లిస్ట్‌ నుంచి తొలగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆల్‌ ఫార్మాట్‌ రెగ్యులర్‌ లేదా కనీసం రెండు వైట్‌ బాల్‌ ఫార్మాట్‌లలో ఒకటైన సాధించిన వారిని ఏ ప్లస్‌, ఏ క్యాటగిరిలలో ఉంటారు. కనీసం రెండు ఫార్మాట్‌లలో ఆడే వారిని బీ, సింగిల్‌ ఫార్మాట్‌ మాత్రమే ఆడేవారు గ్రూప్‌ సీ క్యాటగిరిలను కలిగి ఉంటారు. ఏ ప్లస్‌కు 7, ఏకు 5, బీకు 3....ఇక సీ గ్రూప్‌కు ఆటగాళ్లకు కోటి రూపాయలను ఆఫర్​ చేస్తారు. ఆటగాళ్ల పనితీరు ఆధారంగా ఐసీసీ ర్యాంకింగ్స్‌ను బట్టి తుది జాబితాను తయారు చేస్తారు.

సూర్య ఇక గ్రూప్‌ సీలో ఉన్నప్పటికీ ఏడాదిలో అతని పనితీరును బట్టి..గ్రూప్‌ బీకి ప్రమోట్‌ అయ్యే అవకాశం కనిపిస్తోంది. టీ20 ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌ వన్‌ గా అతను కొనసాగుతున్నారు. అలాగే టెస్ట్‌, వన్డేలలో రాణించగల గిల్‌తో పాటు ఇషాన్‌ కిషన్‌లకు లిస్ట్‌లో చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. టీ-20లలో జాతీయ జట్టుకు సారథ్యం వహించిన పాండ్యా... గ్రూప్‌ బీలో చేరేలా కనబడుతోంది. ఇంకా అపెక్స్‌ కౌన్సిల్‌ అజెండాలలో ప్రధానంగా జెర్సీ, కిట్‌ స్పాన్సర్లు బైజూస్‌, ఎంపీఎల్​లతో పాటు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సబ్‌ కమిటీ... ఐదు వేదికల అప్‌గ్రేడేషన్‌పై కూడా చర్చించనున్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన టీ20 వరల్డ్‌కప్‌, బంగ్లాదేశ్‌ వన్డేలలో భారత ఆటగాళ్ల పనితీరు.. కౌన్సిల్‌... ప్రధాన ఎజెండా కానప్పటికీ చైర్‌పర్సన్‌ నిర్ణయం ఆధారంగా జాబితా సిద్ధమయ్యే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి:యూవీ ఆడిన ఐదు బెస్ట్​ ఇన్నింగ్స్​ ఇవే

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details