Cricketers Retirement Reversal :ఇంగ్లాండ్ స్టార్ ఆల్రౌండర్బెన్స్టోక్స్తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. అయితే స్టోక్స్ టెస్టుల్లో పనిభారం ఎక్కువ కావొద్దన్న ఉద్దేశంతో.. గతేడాది జూన్‌లో వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కాగా తాజాగా రానున్న ప్రపంచ కప్‌లో అతడిని ఎలాగైనా ఆడించాలని.. జట్టు మేనేజ్మెంట్ భావించింది. ఈ క్రమంలో తన రిటైర్మెంట్ వెనక్కి తీసుకునేలా స్టోక్స్‌ను ఒప్పించింది. ఇక 2023 ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ తరఫున స్టోక్స్ ఆడనున్నాడు. ఇలా స్టోక్స్‌తో పాటు అంతర్జాతీయ క్రెకెట్కు వీడ్కోలు పలికి.. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న స్టార్ ఆటగాళ్లెవరో ఇప్పుడు చూద్దాం..
Brendan Taylor Retirement :జింబాబ్వే మాజీ కెప్టెన్ బ్రెండన్ టేలర్.. 2015 ప్రపంచకప్ తర్వాత 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. ఆ తర్వాత టేలర్ ఇంగ్లాండ్ కౌంటీల్లో నాటింగమ్షైర్తో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇక ఈ కాంట్రాక్ట్ ముగిసిన తర్వాత టేలర్.. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నాడు. మళ్లీ ఐదేళ్ల పాటు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇక 2021 సెప్టెంబర్‌లో మళ్లీ రిటైర్ అయ్యాడు.
Dwayne Bravo Retirement : వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో.. 2018లోనే ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. కానీ ప్రపంచవ్యాప్తంగా డొమెస్టిక్ లీగ్‌ల్లో కొనసాగాడు. కాగా 2019లో విండీస్ క్రికెట్ బోర్డులో మార్పులు జరిగాక.. మళ్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్నాడు. తర్వాత యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విండీస్ తరఫున రెండు మ్యాచ్‌ల్లో ఆడాడు. ఆ టోర్నమెంట్ ముగిశాక మళ్లీ రిటైర్మెంట్ తీసుకున్నాడు.