Cricketers In Movies:భారత క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత.. ఒక్కొక్కరు ఒక్కో రంగాన్ని ఎంచుకొని కెరీర్లో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుంటారు. అయితే క్రికెట్ నుంచి దూరం అయ్యేందుకు ఇష్టపడని కొందరు అదే రంగంలో కోచ్‌గా అవతారమెత్తుతారు. మరికొందరు వ్యాపారాల్లో రాణించాలనుకుంటారు. ఇలా ఈ రెండే కాకుండా ఇంకొందరు క్రికెటర్లు.. సినిమాలమీద ఆసక్తితో చిత్ర పరిశ్రమను ఎంచుకున్నారు. అలా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సరైన విజయాలను అందుకోలేకపోయిన టీమ్ఇండియా మాజీ క్రికెటర్లు ఎవరో తెలుసుకుందాం.
ఎంఎస్ ధోనీ.. Dhoni Entertainment Movies: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. సినిమాలపై మక్కువతో 'ధోనీ ఎంటర్టైన్మెంట్' పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించాడు. ఈ బ్యానర్‌కు ధోనీ సతీమణి సాక్షి సింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. అయితే ధోనీ సొంత బ్యానర్‌పై తమిళ్లో 'ఎల్‌జీఎమ్' అనే చిత్రాన్ని నిర్మించాడు. దాదాపు రూ. 8కోట్ల వ్యయంతో రూపొందిస్తే.. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం దక్కించుకోలేకపోయింది.
హర్భజన్ సింగ్.. భారత మాజీ ఆటగాడు స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్.. 2021లో ఫ్రెండ్షిప్ అనే సినిమాలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా.. ఆశించిన స్థాయి ఫలితం అందుకోలేదు. దీంతో నటనవైపు రావాలనుకున్న హర్భజన్‌కు సైతం చేదు అనుభవమే మిగిలింది.