Cricketers Birthday On 6 December : సాధారణంగా క్రికెటర్లు ఒకే రికార్డులను షేర్ చేసుకోవడం లేకుంటే ఒకే అవార్డులును షేర్ చేసుకున్న సందర్భాలు చూసుంటాం కానీ బర్త్‌డేలు షేర్ చేసుకోవడం గురించి ఎక్కడైనా విన్నామా. ఒకవేళ అలా ఉంటే కూడా ఇద్దరు లేక ముగ్గురు షేర్ చేసుకున్న సందర్భాలున్నాయి. కానీ మన టీమ్ఇండియాకు చెందిన రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కరుణ్ నాయర్, శ్రేయర్ అయ్యర్ ఇలా ఐదుగురు క్రికెటర్లు ఒకే రోజున బర్త్‌డే సెలబ్రేట్ చేసుకుని రికార్డు సృష్టిస్తున్నారు. అందులో ముగ్గురు ప్రస్తుత భారత జట్టులో ఉన్న ప్లేయర్లు కాగా, మిగతా ఇద్దరూ మాజీలు. ఇక ఫ్యాన్స్ కూడా తమ అభిమాన తారలకు నెట్టింట బర్త్‌డే విషెస్ తెలుపుతూ సందడి చేస్తున్నారు. విన్నూత్నమైన పోస్టర్లతో విషెస్ తెలుపుతూ ట్రెండ్ అవుతున్నారు.
Ravindra Jadeja Paris Tour : ఇక జడేజా ప్రస్తుతం పారిస్ టూర్లో ఉన్నాడు. తనకు ఫ్రీ టైమ్‌ను ఎంజాయ్ చేస్తున్న ఈ స్టార్ ప్లేయర్ ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పోస్ట్ చేశాడు. పారిస్ పర్యటనను ముగించుకుని ఆ తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్లే భారత జట్టుతో జడేజా కలవనున్నాడు. అయితే సౌతాఫ్రికా టూర్లో భాగంగా జరగనున్న వన్డేలకు జడ్డూ ఎంపిక కాలేదు. కానీ టీ20, టెస్టులకు ప్రకటించిన జట్లలో స్థానం దక్కించుకున్నాడు. అంతేకాకుండా టీ20ల్లో అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మేనేజ్మెంట్ అప్పగించింది. అలా దాదాపు 15 నెలల తరువాత జడేజా టీ20 మ్యాచులు ఆడనున్నాడు. 2022లో జరిగిన ఆసియా కప్ టోర్నీ తర్వాత గాయం కారణంగా టీ20 ప్రపంచకప్‌కు జడేజా దూరమయ్యాడు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ టోర్నీ వల్ల టీ20 మ్యాచులు ఆడనున్నాడు.