తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్​ అకాడమీ ప్రారంభించనున్న యువరాజ్​ సింగ్​ - బిహార్​ క్రికెట్ అకాడమీ యువరాజ్ సింగ్​

టీమ్​ఇండియా విధ్వంసకర బ్యాటర్లలో ఒకరైన యువరాజ్ సింగ్ బిహార్‌లో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నారు. ఆ వివరాలు..

Cricketer Yuvraj Singh bihar cricket academy
Cricketer Yuvraj Singh

By

Published : Apr 29, 2023, 2:47 PM IST

టీమ్​ఇండియా మాజీ స్టార్​ ప్లేయర్​ యువరాజ్ సింగ్ బిహార్‌లోని పుర్నియాలో తొలి క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నారు. శుక్రవారం సాయంత్రం పుర్నియాకు చేరుకున్న ఆయన క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేయబోయే స్థలాన్ని పరిశీలించారు. అంతే కాకుండా ఇందులో తానే స్వయంగా ఆటగాళ్లకు శిక్షణ ఇస్తానని యువరాజ్ సింగ్ తెలిపారు. జాతీయ స్థాయి కోచ్‌లు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడికి వచ్చి క్రీడాకారులకు శిక్షణ ఇస్తారని చెప్పారు.

ఇక్కడి నుంచి క్రీడాకారులకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశం కల్పిస్తామని యువరాజ్‌ సింగ్‌ తెలిపారు. దేశంలో ఎప్పటికప్పుడు నిర్వహించే క్రికెట్ క్యాంపులకు వెళ్లే అవకాశం ఈ అకాడమీకి చెందిన ఆటగాళ్లకు లభిస్తుందని పేర్కొన్నారు. అయితే ఇందులోకి ఎలా ప్రవేశించాలన్న అంశాల గురించి ఎటువంటి వివరణ ఇవ్వలేదు.

"అకాడమీలోని ఆటగాళ్లకు నేనే శిక్షణ ఇస్తాను. ఇకపై ఇక్కడి పిల్లలు క్రికెట్ మెలకువలు నేర్చుకునేందుకు బిహార్ బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. మా క్రికెట్ అకాడమీలో ఆడే ఆటగాళ్లకు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడేందుకు అవకాశం కల్పిస్తాం. కంట్రీ అకాడమీ ఆటగాళ్లకు ఎప్పటికప్పుడు నిర్వహించే క్రికెట్ క్యాంపులకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది" అని యువరాజ్​ సింగ్​ తెలిపారు.

ఈ అకాడమీలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్, వికెట్ కీపింగ్‌తో పాటు శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వాన్ని పెంపొందించేందుకు కూడా ఇక్కడ శిక్షణ ఇవ్వనున్నారు. అబ్బాయిలతో పాటు బాలికలకు కూడా ఈ అకాడమీలో శిక్షణ ఇవ్వనున్నారు. క్రీడాకారుల కోసం అత్యాధునిక సౌకర్యాలు కూడా ఉంటాయని.. వారు తమ నైపుణ్యాలతో పాటు అభిరుచిని పెంపొందించుకోవడానికి ఈ అకాడమీ దోహద పడుతుందని అన్నారు. అంతే కాకుండా ఇక్కడ క్రీడాకారులకు ప్రపంచ స్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details