తెలంగాణ

telangana

ETV Bharat / sports

పృథ్వీ షా 'సెల్ఫీ' వివాదంలో కొత్త ట్విస్ట్​.. అతడే మద్యం తాగి బ్యాట్​తో కొట్టాడట! - prithvi shaw social media influencer

టీమ్​ఇండియా క్రికెటర్​ పృథ్వీషా సెల్ఫీ వివాదంలో కొత్త మలుపు తిరిగింది! సెల్ఫీ తీసుకునేందుకు నిరాకరించడమే కాకుండా.. అతడే మద్యం తాగి బ్యాట్​తో దాడి చేశాడని ఆ వివాదంలో అరెస్టైన మహిళ తరఫున న్యాయవాది ఆరోపించారు.

cricketer prithvi shaw selfie controversy
cricketer prithvi shaw selfie controversy

By

Published : Feb 17, 2023, 6:52 AM IST

సెల్ఫీ ఇవ్వనందుకు.. టీమ్​​ఇండియా క్రికెటర్​ పృథ్వీ షాను వెంబడించి కొందరు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వివాదంలో కొత్త మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు అరెస్ట్​ చేసిన సోషల్​మీడియా ఇన్​ఫ్లుయిన్సర్​ సప్నా గిల్​ తరఫు న్యాయవాది.. సంచలన ఆరోపణలు చేశారు. పృథ్వీ షా.. మద్యం తాగి బ్యాట్​తో దాడి చేశాడని ఆరోపించారు.

"ఫైవ్​ స్టార్​ హోటల్​లో సప్నా గిల్​.. సెల్ఫీ తీసుకునేందుకు పృథ్వీ షా దగ్గరకు వెళ్లింది. అప్పుడు వారంతా పార్టీ చేసుకుంటున్నారు. ఆ సమయంలో షా కూడా మద్యం సేవించి ఉన్నాడు. అప్పుడు తన దగ్గర ఉన్న బ్యాట్​తో సప్నాపై దాడి చేశాడు. తర్వాత రోజు.. ఆమెపైనే కేసు పెట్టాడు. ఇప్పుడు అతడిపై మేము కేసు పెడతాం. మద్యం సేవించి అతడు కారు నడిపాడు. బైక్​ను కూడా ఢీకొన్నట్లు తెలిసింది. సప్నా, పృథ్వీ షా మధ్య ఎలాంటి పరిచయం లేదు" అని సప్నా గిల్​ లాయర్​ అలీ కాషిఫ్​ ఖాన్​ దేశ్​ముఖ్​ తెలిపారు.

ఇదీ జరిగింది!
పోలీసుల సమాచారం ప్రకారం.. స్టార్​ ఆటగాడు పృథ్వీ షా తన స్నేహితుడు సురేంద్రతో కలిసి బుధవారం రాత్రి ముంబయిలో శాంతా క్రూజ్​లోని ఓ ఫైవ్​ స్టార్​ హోటల్​కు వెళ్లాడు. అక్కడ షాను చూసిన కొందరూ సెల్ఫీ దిగేందుకు ముందుకొచ్చారు. అయితే అక్కడున్న ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు పృథ్వీ ఆసక్తి చూపించడం వల్ల మిగతా వారు అసహనం వ్యక్తం చేశారు. తమతో కూడా ఫొటో దిగాలని కోరారు. దానికి షా నిరాకరించడం వల్ల సదరు వ్యక్తులు తమకు సెల్ఫీ ఇచ్చే తీరాలంటూ డిమాండ్​ చేశారు. దీంతో అక్కడే ఉన్న షా స్నేహితుడు హోటల్​ మేనేజర్​కు కంప్లైంట్​ చేశాడు. అక్కడికి వచ్చిన మేనేజర్​ నిందితులను వెళ్లగొట్టాడు.

ఇదంతా మనసులో పెట్టుకున్న నిందితుల్లోని ఓ మహిళ.. షా కారును వెంబడించింది. అంతే కాకుండా అతడితో వాగ్వవాదానికి దిగింది. అతడిపై దాడి కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్​మీడియాలో వైరల్​గా మారింది. ఈ విషయం గురించి షా స్నేహితుడు సురేంద్ర స్పందించాడు. తమ వద్ద నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసిందని అతడు తెలిపాడు. ఒక వేళ ఆ డబ్బును తాము ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించిందని చెప్పాడు. ఇక చేసేదేం లేక నిందితులపై షా స్నేహితుడు ముంబయి ఓషివారా పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హోటల్​ సిబ్బందిని విచారించి నిందితుల్లో ఇద్దరైన సనా అలియాస్​ సప్నా గిల్​​ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఎనిమిది మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details