తెలంగాణ

telangana

ETV Bharat / sports

విషాదం - క్రికెట్ ఆడుతూ ఇద్దరు మృతి - గుండెపోటుతోక్రికెటర్​మృతి

Cricketer Died : రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఇద్దరు ప్లేయర్స్‌ మృతి చెందారు. ఆ వివరాలు..

విషాదం - క్రికెట్ ఆడుతూ ఇద్దరు మృతి
విషాదం - క్రికెట్ ఆడుతూ ఇద్దరు మృతి

By ETV Bharat Telugu Team

Published : Jan 10, 2024, 3:06 PM IST

Cricketer Died :క్రికెట్ ఆడుతూ మైదానంలోనే ఇద్దరు ప్రాణాలు విడిచిన సంఘటనలు వేర్వేరు ప్రాంతాల్లో జరిగాయి. గుండెపోటుతో ఒకరు, తలకు బంతి తగలడం వల్ల మరొకరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన వికాస్‌ నేగి(34) అనే వ్యక్తి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నారు. స్థానికంగా క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సమయంలో అతడు అస్వస్థతకు గురయ్యాడు. రన్స్‌ తీస్తూ పిచ్‌ మధ్యలోకి రాగానే ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన సహా ఆటగాళ్లు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వికాస్‌ ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. గుండెపోటుతో మరణించినట్లు రిపోర్ట్ వచ్చింది. కాగా, పోలీసులు, మృతుడి స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం వికాస్‌ గతంలో కరోనా బారిన పడి పూర్తిగా కోలుకున్నారు.

మైదానంలో బాల్ తగిలి : మరో విషాదకర సంఘటన మహారాష్ట్ర రాజధాని ముంబయిలోని ఓ ప్రాంతంలో చోటు చేసుకుంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతూ 52 ఏళ్ల వ్యక్తి మరణించాడు. అసలేం జరిగందంటే. 50 ఏళ్ల పైబడిన వారికి అక్కడ 'కుచ్చి వీసా ఓస్వాల్ వికాస్ లెజెండ్ కప్' పేరిట టీ20 క్రికెట్‌ టోర్నీ నిర్వహించారు. సమయం ఎక్కువ లేకపోవడం, స్థలం కొరత కారణం, వేరే మైదానాలు అందుబాటులో లేకపోవడం వల్ల ఒకే మైదానంలో ఎక్కువ మ్యాచ్‌లను నిర్వహించాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే పక్కనే జరుగుతున్న మ్యాచ్‌లో ఓ బ్యాటర్ బాదిన బంతి ఓ ప్లేయర్‌ తలకు వెనక నుంచి వచ్చి బలంగా తాకింది. వెంటనే అతడు కుప్పకూలాడు. దీంతో షాక్ అయిన అతడి సహ ఆటగాళ్లు వెంటనే హస్పిటల్​కు తరలించారు. కానీ అతడు కూడా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేశారు. ప్రమాదవశాత్తూ క్రికెటర్ మృతి చెందినట్లుగా రిపోర్ట్ తయారు చేశామని అధికారులు తెలిపారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించామని చెప్పారు. అలా క్రికెట్​ ఆడుతూ ఒక్క రోజులోనే ఇద్దరు కన్నుమూశారు.

ABOUT THE AUTHOR

...view details