తెలంగాణ

telangana

ETV Bharat / sports

రాంచీ రోడ్డుపై ధోనీ కారు రయ్ రయ్​.. పక్కన ఉంది ఆమెనేనా!

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. పాతకాలానికి చెందిన కారుతో రోడ్డుపై చక్కర్లుకొట్టాడు. అయితే ఆ సమయంలో కారులో ఇంకో వ్యక్తి కూడా ఉన్నారు. వారెవరంటే!

dhoni car ride with his daughter
కారు నడుపుతున్న ధోనీ

By

Published : Jul 26, 2023, 8:19 PM IST

Updated : Jul 26, 2023, 10:26 PM IST

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తన గ్యారేజ్​లోని పాత కాలంనాటి ఓ కారులో చక్కర్లు కొడుతూ కెమెరాకు చిక్కాడు. రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన నీలం రంగు కారును తనే స్వయంగా డ్రైవింగ్ చేస్తూ రాంచీ రోడ్డుపై తిప్పాడు. కాగా ఈ రైడ్​లో తన కుమార్తె జీవాసింగ్ పక్క సీట్​లో ఉండడం విశేషం. అయితే ఆ కారు 1980వ సంవత్సరానికి చెందినదిగా తెలుస్తోంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. కాగా ఇటీవలే ధోనీ ఫ్యామిలీతో కలిసి విమానంలో ప్రయాణిస్తుండగా.. క్యాండీక్రష్ గేమ్ ఆడుతున్నట్లు కనిపించాడు. ఆ వీడియో సైతం వైరలయ్యింది. ఇక ధోనీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరయ్యాక.. కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తున్నట్లు కనిపిస్తోంది.

అయితే మహీకి కార్లన్నా, బైకులన్నా ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాహనం ఏదైనా, ఎంత ఖరీదైనా సరే.. తనకు నచ్చితే గ్యారేజ్​లో ఉండాల్సిందే. ఈ మధ్య టీమ్ఇండియా మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్​ కూడా ధోనీ గ్యారేజ్​ను సందర్శించాడు. అక్కడున్న వెహికిల్ కలెక్షన్​ చూసి ఆశ్చర్యపోయినట్లు తెలిపాడు. మహీ గ్యారేజ్​లో ఉన్న బైక్​లు, కార్ల గురించి ట్విట్టర్​లో చెప్పుకొచ్చాడు. అయితే మహీ బైక్​, కారుతో రోడ్ల మీద చక్కర్లు కొట్టడం కొత్తేమీ కాదు. కానీ తన కుమార్తె జీవాసింగ్ పక్కనే కుర్చోవడం ఈ వీడియోకు ప్రాధాన్యత సంతరించుకుంది. రోడ్డు పక్కనే వెళ్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు ఈ సన్నివేశాన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు.

Dhoni Cricket Career : ధోనీ 2004లో అంతర్జాతీయ క్రికెట్​లో అరంగేట్రం చేశాడు. దాదాపు 15 ఏళ్లపాటు సాగిన అతడి కెరీర్​లో ఎన్నో మైలురాళ్లు అందుకున్నాడు. చాలా కాలం టీమ్ఇండియాలో ఫినిషర్​గా మారి ఎన్నో విజయాలను కట్టబెట్టాడు. కాగా కెరీర్​లో.. 44.9 సగటుతో మొత్తం 17,266 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 108 అర్ధ శతకాలు ఉన్నాయి. అతడి వ్యక్తిగత అత్యధిక స్కోరు 224 పరుగులు. అయితే 2023 ఐపీఎల్​ ధోనీకి చివరిదని అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది. కానీ ధోని వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిపాడు.

Last Updated : Jul 26, 2023, 10:26 PM IST

ABOUT THE AUTHOR

...view details