టీమ్ఇండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి కిరణ్ పాల్ సింగ్ మృతి చెందారు. క్యాన్సర్‌తో గతకొన్నిరోజులుగా పోరాడుతున్న ఆయన.. మేరట్‌లోని ఆస్పత్రిలో గురువారం కన్నుమూశారు. ఉత్తరప్రదేశ్‌లో పోలీస్‌శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ పనిచేసి, కొన్నేళ్ల క్రితం రిటైరయ్యారు కిరణ్‌పాల్ సింగ్.
స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఇంట్లో విషాదం - Bhuvneshwar Kumar latest news
భారత్, సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తండ్రి క్యాన్సర్ తుదిశ్వాస విడిచారు. గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు.
భువనేశ్వర్ కుమార్
గాయం కారణంగా గతేడాది ఐపీఎల్‌కు దూరమైన భువీ.. ఈసారి కూడా ఆ సమస్య వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రారంభ మ్యాచ్‌ల్లో ఆడలేకపోయాడు. ఫిట్నెస్ సాధించి, ఆడతాడు అన్న సమయానికి కరోనా కేసుల వల్ల సీజన్ నిరవధిక వాయిదా పడింది. త్వరలో జరగాల్సిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఇంగ్లాండ్ పర్యటన కోసం ప్రకటించిన జట్టులో భువనేశ్వర్‌కు చోటు దక్కలేదు.