తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఏప్రిల్ 15న భారత ప్రపంచకప్ జట్టు ప్రకటన - బీసీసీఐ

ఏప్రిల్ 15న ప్రపంచకప్​లో ఆడబోయే భారత జట్టును ఎంపిక చేయనుంది బీసీసీఐ. మొత్తం 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టును ప్రకటించనుంది.

ప్రపంచకప్​

By

Published : Apr 8, 2019, 12:35 PM IST

ప్రపంచకప్​-2019కు భారత జట్టును ఎంపిక చేసే తేదీ ఖరారు చేసింది బీసీసీఐ. ఏప్రిల్ 15న మెగాటోర్నీలో ఆడే 15 మంది క్రీడాకారుల జాబితాను ప్రకటించనుంది. మే 30నుంచి ఇంగ్లండ్ వేదికగా వరల్డ్​కప్​ జరగనుంది. మొత్తం పది దేశాలు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి.

ఆస్ట్రేలియా(1987, 1999, 2003, 2007, 2015) అత్యధికంగా 5 సార్లు ప్రపంచకప్​ను అందుకోగా.. వెస్టిండీస్(1975, 1979), భారత్(1983, 2011) చెరో రెండు సార్లు చేజిక్కించుకున్నాయి. పాకిస్థాన్(1992), శ్రీలంక (1996) చెరో సారి దక్కించుకున్నాయి.

ఇంగ్లండ్ 3 సార్లు ఫైనల్​ వరకు వెళ్లినా.. ఒక్కసారీ కప్పు గెలవలేకపోయింది. స్వదేశంలో జరగనున్న ఈ ప్రపంచ్​కప్​నైనా ​ గెలవాలని భావిస్తోంది ఇంగ్లీష్ జట్టు. మరోవైపు కోహ్లీసేన మూడోసారి ప్రపంచకప్​ను ముద్దాడాలని చూస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే ఈ టోర్నీ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details