తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: వాంఖడేలో విచిత్రం... రెండుసార్లు 'టాస్' - 2011 భారత్​ - శ్రీలంక మధ్య ప్రపంచకప్​ ఫైనల్​

2011 భారత్​ - శ్రీలంక మధ్య ప్రపంచకప్​ ఫైనల్​. ఈ మ్యాచ్​ టాస్​ సమయంలో హైడ్రామా నడిచింది. ఫలితంగా తొలిసారి ప్రపంచకప్​లో రెండోసారి టాస్​ వేయాల్సి వచ్చింది.

WC19: వాంఖడేలో విచిత్రం... రెండుసార్లు 'టాస్'

By

Published : May 14, 2019, 11:51 PM IST

సాధారణంగా క్రికెట్​ మ్యాచ్​లో టాస్​ ఒకసారి వేస్తారు. కాని ఆ రోజు మాత్రం రెండుసార్లు వేయాల్సి వచ్చింది. అదీ ప్రపంచకప్​ మ్యాచ్​లో జరగడం గమనార్హం.

వాంఖడే స్టేడియం 33 వేల మంది అభిమానులతో నిండిపోయి ఉంది. సొంతగడ్డపై ఫైనల్​ మ్యాచ్​ నెగ్గి 28 ఏళ్ల తర్వాత కప్పు గెలవాలని భారత జట్టు ఎదురుచూస్తోంది. ఆ మ్యాచ్​లో భారత కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ, శ్రీలంక సారథి కుమార్​ సంగక్కర టాస్​ కోసం నిల్చున్నారు. ధోనీ కాయిన్‌ను పైకి విసిరిన తర్వాత రవిశాస్త్రి 'హెడ్' పడినట్లు చెప్పాడు. ధోనీ వెంటనే తాము మొదట బ్యాటింగ్ చేస్తామని తెలపగానే...ఆ విషయాన్ని నిర్ణయించుకునేందుకు రవిశాస్త్రి రిఫరీ వైపు చూశాడు. అయితే తానూ 'హెడ్'​ కోరుకున్నట్లు సంగక్కర చెప్పడం అయోమయ పరిస్థితికి దారితీసింది.

టాస్ వేసినప్పుడు సంగక్కర ఏం చెప్పాడనేది అభిమానుల గోలలో వినపడలేదని రిఫరీ చెప్పడం... ఈ గందరగోళానికి చెక్​ పెడుతూ ఇరుజట్ల సారథులు మరోసారి టాస్ వేసేందుకు అంగీకరించారు. ధోనీ మళ్లీ టాస్ వేయగా ఈ సారి సంగక్కర 'హెడ్' అని గట్టిగా అరిచాడు. కాయిన్ హెడ్ చూపించడం వల్ల సంగక్కర బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

అసలు ఇరుజట్ల సారథులు తొలుత బ్యాటింగ్​ కోసం మొగ్గుచూపడానికి కారణం వాంఖడే స్టేడియంలో మొదటి బ్యాటింగ్ చేసిన వారు గెలిచే అవకాశాలుంటాయి. ఈ మ్యాచ్​లో భారత్ 6 వికెట్ల తేడాతో శ్రీలంకపై గెలిచి రెండోసారి వరల్డ్ కప్‌ను అందుకుంది.

2011 వరల్డ్​కప్ విజేత భారత్​

ABOUT THE AUTHOR

...view details