తెలంగాణ

telangana

ETV Bharat / sports

పెరిగిన స్టాండ్​బై ఆటగాళ్లు.. వెళ్లేది 16 మంది

ఇంగ్లండ్​లో జరగనున్న వన్డే ప్రపంచకప్​ కోసం ఐదుగురు ఆటగాళ్లను స్టాండ్​బైగా ఎంపిక చేసింది బీసీసీఐ.  ఇద్దరు బ్యాట్స్​మెన్, ఇద్దరు పేసర్లతో పాటు ఒక స్పిన్నర్​ను రిజర్వ్ ప్లేయర్లుగా తీసుకుంది.

పెరిగిన స్టాండ్​బై ఆటగాళ్లు.. వెళ్లేది 16 మంది

By

Published : Apr 18, 2019, 5:59 PM IST

ఇంగ్లండ్‌లో జ‌రిగే వ‌న్డే ప్రపంచకప్​ కోసం ఐదుగురిని స్టాండ్​బై ప్లేయర్లుగా ఎంపిక చేసింది బీసీసీఐ. వీరిలో రిషభ్ పంత్​, అంబటి రాయుడు, సైనీలు ఇప్పటికే చోటు దక్కించుకోగా.. తాజాగా ఈ జాబితాలో ఇషాంత్​ శర్మ, స్పిన్నర్​ అక్షర్​ పటేల్​ చేరారు.

  • ప్రపంచకప్​ కోసం 15 మంది స‌భ్యుల‌తో కూడిన టీమిండియా జ‌ట్టును రెండు రోజుల క్రితం ప్రకటించారు సెలక్టర్లు. జట్టులో ఎవరికైనా గాయాలైతే ఆడేందుకు ఐదుగురు ఆటగాళ్లను రిజ‌ర్వ్‌ ప్లేయర్లుగా ఎంపిక చేశారు. వీరిలో కోహ్లీ సేన‌తో సైనీ ఒక్క‌డే విమానం ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక స్టాండ్‌బైలో ఉన్న మిగతా న‌లుగురు అవసరాన్ని బట్టి ఇంగ్లండ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

మే 30 నుంచి ప్రపంచకప్​ ప్రారంభమవుతుంది. భారత్ తన మొదటి మ్యాచ్​లో జూన్​ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.​.

ABOUT THE AUTHOR

...view details