తెలంగాణ

telangana

ETV Bharat / sports

వ్యంగ్యంగా ఆవేదన వ్యక్తపరిచిన రాయుడు - ప్రపంచకప్​

ప్రపంచకప్​లో చోటు ఆశించి భంగపడ్డ అంబటి రాయుడు తన ఆవేదనను భిన్నంగా వ్యక్తపరిచాడు. భారత జట్టుకు ఎంపిక చేయకపోవడంపై చీఫ్‌ సెలక్టర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

వ్యంగ్యంగా ఆవేదన వ్యక్తపరిచిన రాయుడు

By

Published : Apr 16, 2019, 11:29 PM IST

వరల్డ్‌కప్‌ మ్యాచ్​లను ‘3డీ’ కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు ట్విట్టర్​ ద్వారా తన అసంతృప్తిని వ్యక్తపరిచాడు. తనను కాదని ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేయడానికి.. ఎంఎస్‌కే ఇచ్చిన వివరణ రాయుడిని బాధపెట్టింది.

  • విజయ్‌ శంకర్‌ త్రీ డైమెన్షన్స్‌ ఉన్న ఆటగాడు కాబట్టే రాయుడు బదులు విజయ్​ను ఎంపిక చేశామంటూ సమాధానమిచ్చాడు ఎమ్మెస్కే. ఆ మాటలకు బదులుగా ‘ నేను ఇప్పుడే త్రీడీ కళ్లద్దాల కోసం ఆర్డర్‌ చేశా. వచ్చే వరల్డ్‌కప్‌ను ఆ గ్లాసెస్‌తోనే చూడాలనుకుంటున్నా’ అంటూ ట్విట్టర్​ వేదికగా చురకలంటించాడు రాయుడు.

భారత వరల్డ్‌కప్‌ జట్టును సోమవారం ప్రకటించారు. 'నాలుగో స్థానం కోసం రాయుడు, శంకర్‌లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే విజయ్​ శంకర్‌ 3 రకాలుగా ఉపయోగపడతాడు. బ్యాటింగ్‌, బౌలింగే కాదు మంచి ఫీల్డర్‌ కూడా. అందుకే శంకర్‌ వైపే మొగ్గు చూపాం. అంతేకాకుండా టీమిండియా చివరి రెండు సిరీస్‌లలో శంకర్‌ ఎంతగానో ఆకట్టుకున్నాడు' అని ఎంఎస్‌కే ప్రసాద్‌ చెప్పుకొచ్చాడు.

  • టీమిండియా తరఫున మంచి సగటు కలిగి ఉన్న ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్‌కు బదులుగా ఆల్‌రౌండర్‌ విజయ్‌ శంకర్‌ను ఎంపిక చేశారు సెలక్టర్లు. దీనిపై ఐసీసీ ఆశ్చర్యం వ్యక్తం చేయడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details