ఇంగ్లండ్ ప్రపంచకప్ జట్టు నుంచి ఎవరైనా ఆటగాడు తప్పుకుంటే జోఫ్రా ఆర్చర్‌కు చోటుదక్కుతుందని ఆ దేశ మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్ అభిప్రాయపడ్డాడు. ఆర్చర్ చాలా మంచి బౌలర్ అని కితాబిచ్చాడు. ప్రపంచకప్ అధికార గేయం 'స్టాండ్ బై' ఆవిష్కరణ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశాడు ఫ్లింటాప్.
'అడ్డు తప్పుకొని.. ఆర్చర్‌కు అవకాశమివ్వండి' - worldcup
ప్రపంచకప్ జట్టు నుంచి ఎవరైనా తప్పుకుంటే జోఫ్రా ఆర్చర్‌ను ఆడించవచ్చని అభిప్రాయపడ్డాడు ఇంగ్లండ్ క్రిెకెట్ జట్టు మాజీ కెప్టెన్ ఆండ్రూ ఫ్లింటాఫ్. ఆర్చర్ అద్భుతమైన బౌలరని కొనియాడాడు.
ఫ్లింటాఫ్
"నేను అతడి(ఆర్చర్) బౌలింగ్‌ను చూశాను. చాలా అద్భుతంగా బంతులు వేస్తున్నాడు. 15 మంది జట్టులో ఎవరినైనా తప్పిస్తే అతడి స్థానంలో ఆర్చర్‌కు అవకాశం కల్పించవచ్చు" -ఆండ్రూ ఫ్లింటాప్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్.
జోఫ్రా ఆర్చర్ నిలకడగా గంటకు 145 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తున్నాడని, యార్కర్లతో పాటు స్లో బాల్స్ కూడా సంధించగల సమర్థుడని ప్రశంసలతో ముంచెత్తాడీ ఇంగ్లీష్ మాజీ సారథి. వరల్డ్‌కప్ జట్టుకు ఎంపిక చేసిన 15 మందిలో జోఫ్రా ఆర్చర్‌కు చోటు దక్కలేదు.