తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ప్రపంచకప్ కోసం ఆత్రుతగా చూస్తున్నా' - చాహల్

వరల్డ్​కప్ ​కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నట్లు భారత స్పిన్నర్ చాహల్ తెలిపాడు. ప్రపంచకప్​కు ఎంపికవడం పట్ల ఆనందం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్​పైనే దృష్టి పెట్టినట్లు చెప్పాడు.

చాహల్

By

Published : Apr 16, 2019, 12:39 PM IST

ప్రపంచకప్​ జట్టుకు ఎంపికవడం పట్ల భారత బౌలర్​ చాహల్ సంతోషం వ్యక్తం చేశాడు. తొలిసారి మెగాటోర్నీ ఆడబోతున్న చాహల్ ప్రస్తుతం ఐపీఎల్​పైనే దృష్టిసారించినట్లు తెలిపాడు. సోమవారం ఎమ్​ఎస్​కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది.

"ప్రపంచకప్​లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. తొలిసారి మెగాటోర్నీలో ఆడబోతున్నందుకు సంతోషంగా ఉంది. ఇందుకోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. ప్రస్తుతం ఐపీఎల్​పైనే దృష్టిపెట్టాను" -చాహల్, భారత ఆటగాడు

41 వన్డేలాడిన చాహల్ 23.83 సగటుతో 72 వికెట్లు తీశాడు. ప్రస్తుతం ఐపీఎల్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ సీజన్​లో 8 మ్యాచ్​లాడిన చాహల్ 13 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో మూడో స్థానంలో ఉన్నాడు.

మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్ జరగనుంది.

ABOUT THE AUTHOR

...view details