2019 ప్రపంచకప్ జట్టు కూర్పులో.. అద్భుతంగా రాణిస్తున్న అంబటి రాయుడును తీసుకోకపోవడం వెనుక కారణమేంటి..? మాజీ క్రికెటర్లే నిర్ఘాంతపోతూ ప్రశ్నలు సంధిస్తున్నారు. భారత్ తరఫున వన్డేల్లో నాలుగో అత్యధిక బ్యాటింగ్ సగటు అంబటిదే.
.
- విరాట్ కోహ్లీ (59.57), ధోని (50.37), రోహిత్ (47.39) తర్వాత బ్యాటింగ్ సగటులోరాయుడు (47.05) నాలుగో స్థానంలో ఉన్నాడు.
- 2013లో భారత వన్డే జట్టులోకి ఎంపికైన రాయుడు ఇప్పటి వరకు 55 మ్యాచ్‌లు ఆడి 47.05 సగటుతో 1,694 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది రాయుడు తడబడ్డాడు. 10 వన్డేలు ఆడి ఒక అర్ధ సెంచరీ మాత్రమే సాధించాడు.
ఎన్నో వదులుకున్నా...
ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టులో చోటు కోసం ఏడాది కాలం నుంచి హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడు తీవ్రంగా కష్టపడుతున్నాడు. రంజీకి వీడ్కోలు పలికి వన్డే ఫార్మాట్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాడు. గతేడాది సెప్టెంబరులో ఆసియా కప్‌లో పునరాగమనం చేసి సత్తా చాటాడు. టీమిండియాలో ‘నాలుగో ’ స్థానానికి రాయుడు కచ్చితంగా సరిపోతాడు అనుకున్న అభిమానులకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. రాయుడును కాదని తమిళనాడు ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌వైపు బోర్డు మొగ్గు చూపింది.