భారత సీనియర్ క్రికెటర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లకు రిటైర్మెంటు ప్రకటించేశాడు. ఎన్నోసార్లు తను విఫలమైనా క్రికెట్‌ను వదిలిపెట్టలేదని... చివరి శ్వాస వరకు క్రికెట్ అంటే అంతే ప్రేమ ఉంటుందని చెప్పుకొచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ గుడ్‌బై - ప్రపంచకప్ హీరో యువరాజ్‌సింగ్
టీమిండియా సీనియర్ ఆటగాడు, 2011 ప్రపంచకప్ హీరో యువరాజ్‌సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ముంబయిలో జరిగిన మీడియా సమావేశంలో యువీ వీడ్కోలు అంశంపై స్పష్టత ఇచ్చాడు.
నేడే యువరాజ్ కెరీర్‌కు వీడ్కోలు పలికేనా..!
ఎప్పుడో రిటైర్మెంటు ప్రకటించాల్సి ఉన్నా బీసీసీఐ అనుమతి కోసమే వేచిచూశానని చెప్పాడు యువీ. రిటైర్మెంట్ తర్వాత ఐసీసీ అనుమతి పొందిన ఇతర దేశాల్లో టీ20 క్రికెట్ ఆడేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
మీడియా సమావేశంలో యువీ కన్నీటిపర్యంతమయ్యాడు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో తను ఆడిన ఇన్నింగ్స్‌ను ఓ మాయని మచ్చగా అభివర్ణించాడు. సచిన్ తనకు ఆదర్శమని కొనియాడాడు. 2011 క్రికెట్ ప్రపంచకప్ ఆడిన జట్టు తనకు ముఖ్యమని చెప్పుకొచ్చాడు.
Last Updated : Jun 10, 2019, 2:24 PM IST