భారత వన్డే ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భారత క్రికెట్‌లో ఓ శకం ముగిసిందంటూ క్రికెట్ అభిమానులు, క్రీడాకారులు, సినీతారలు ఎన్నో ట్వీట్లు చేశారు.
యూవీ అసలైన ఛాంపియన్ అని కోహ్లీ.. క్రికెట్ చరిత్రలో ఓ గొప్ప ఆటగాడిగా మిగిలిపోతావ్ అంటూ లక్ష్మణ్, ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు.. కానీ యువరాజ్ లాంటి వాళ్లు మాత్రం అరుదని సెహ్వాగ్, జట్టుకు అవసరమైనప్పుడల్లా సత్తా చాటిన నిజమైన ఛాంపియన్‌వంటూ దిగ్గజం సచిన్ యువరాజ్‌పై ప్రశంసలు కురిపించారు. అయితే భారత ఓపెనర్ రోహిత్ శర్మ మాత్రం యువీ రిటైర్మెంట్‌పై కాస్త భిన్నంగా స్పందించాడు.