క్రికెట్ ప్రపంచకప్ తుది దశకు చేరుకుంది. లీగ్ దశ అనంతరం.. టాప్ 4 జట్ల స్థానాలు, సెమీస్‌లో తలపడబోయే ప్రత్యర్థులు, వేదికలపై స్పష్టత వచ్చింది. శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా పాయింట్ల పట్టికలో తొలిస్థానంలో నిలిచింది టీమిండియా. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ వరుసగా మిగతా స్థానాల్లో నిలిచాయి.
'సెమీస్': భారత్Xకివీస్.. ఆసీస్Xఇంగ్లాండ్ - మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్
ప్రపంచకప్‌లో శనివారం జరిగిన రెండు మ్యాచ్‌ల ఫలితాల ఆధారంగా టాప్ నాలుగు జట్ల స్థానాలు ఖరారయ్యాయి. చివరి లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా... మరో పోరులో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచింది దక్షిణాఫ్రికా.
!['సెమీస్': భారత్Xకివీస్.. ఆసీస్Xఇంగ్లాండ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3769004-1017-3769004-1562449513854.jpg)
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా మంగళవారం (జులై 9న) జరిగే తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది టీమిండియా. టోర్నీ చివరి లీగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి పరిమితమైంది. అగ్రస్థానం దక్కించుకున్న భారత్ .. నాలుగో స్థానంలోని కివీస్‌తో తలపడనుంది. మూడో స్థానంలో నిలిచిన ఆతిథ్య ఇంగ్లాండ్‌తో గురువారం (జులై 11న) బర్మింగ్ హామ్ వేదికగా రెండో సెమీఫైనల్లో తలపడుతుంది ఆసీస్.
శనివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌ల్లో భాగంగా శ్రీలంకపై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించగా... మరో పోరులో ఆస్ట్రేలియాపై 10 పరుగుల తేడాతో గెలిచింది దక్షిణాఫ్రికా.