తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: వర్షం కారణంగా.. సెమీస్​ బుధవారానికి వాయిదా - మాంచెస్టర్​

కాసేపట్లో టాస్​

By

Published : Jul 9, 2019, 2:36 PM IST

Updated : Jul 9, 2019, 11:21 PM IST

2019-07-09 22:53:34

సెమీస్ మ్యాచ్​కు బ్రేక్​.. రిజర్వ్​ డేలో కొనసాగింపు

భారత్​ - న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న సెమీస్ మ్యాచ్​ వర్షం కారణంగా బుధవారానికి వాయిదా పడింది. ఎడతెరపని వానతో మ్యాచ్​ను ఈ రోజు నిలిపివేశారు. రిజర్వ్​ డే రోజు మ్యాచ్​ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి కొనసాగుతుంది.  టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. 

2019-07-09 22:26:47

వరణుడు ఆగడం లేదు..

రెండున్నర గంటల సేపు మ్యాచ్​ను నిలువరించిన వాన ఆగిందనుకునేలోపు మళ్లీ మొదలైెెంది. వెనక్కి తీసుకెళ్లిన కవర్లు పిచ్​పై మళ్లీ పరుస్తున్నారు

2019-07-09 22:04:00

తగ్గుముఖం పట్టిన వర్షం.. మ్యాచ్​ ప్రారంభమవుతుందా..!

ఓల్డ్ ట్రాఫోర్డ్​ మైదానంలో వర్షం ఆగింది. గ్రౌండ్​లో నీటిని తీసే పనిలో నిమగ్నమయ్యారు నిర్వాహకులు. మ్యాచ్​ ప్రారంభమయ్యే అవకాశం ఉందా లేదా అనేది కాసేపటిలో తెలుస్తుంది

2019-07-09 20:49:56

అంతకంతకు పెరుగుతోన్నవాన

మ్యాచ్​ ఆగిపోయి దాదాపు రెండు గంటలు కావస్తున్నా.. వరణుడు మాత్రం కరుణించట్లేదు. ఇంకా ఉదృతంగా పెరుగుతూనే ఉంది. ఓవర్లు తగ్గించే అవకాశముంది. 

2019-07-09 20:49:51

కివీస్ ఇన్నింగ్స్ చివర్లో వచ్చిన వర్షం ఇంకా పెరుగింది. గ్రౌండ్ స్టాఫ్ మైదానమంతటిని కవర్లతో కప్పి వేశారు. తర్వాతి వివరాలు తెలియాల్సి ఉంది.  

2019-07-09 19:11:37

తగ్గని వాన..

46 ఓవర్లు తర్వాత మ్యాచ్​కు వరణుడు అడ్డుతగిలాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. క్రీజులో టేలర్(67), లాథమ్(3) ఉన్నారు.

ఇది చదవండి: రిజర్వ్​ డేలోనూ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి?

2019-07-09 18:52:28

ఇంకా కురుస్తోన్న వర్షం

46 ఓవర్లకు కివీస్ స్కోరు 209/5

45వ ఓవర్ వేసిన భువి 5 పరుగులే ఇచ్చాడు. అనంతరం 46వ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. క్రీజులో లాథమ్(3), టేలర్(65) ఉన్నారు.

2019-07-09 18:31:38

వర్షం కారణంగా ఆగిన మ్యాచ్​

భువనేశ్వర్ వేసిన 45 ఓవర్ వేసిన తొలి బంతి ఆడిన టేలర్​కు ఎల్బీడబ్ల్యూ ఇచ్చాడు అంపైర్. అయితే కివీస్ బ్యాట్స్​మన్ రివ్యూ తీసుకోగా.. పిచ్ ఔట్​సైడ్ ఆఫ్ తేలడంతో టేలర్ బతికిపోయాడు. ఇదే ఓవర్లో నాలుగో బంతికి కీపర్​కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు గ్రాండ్​హోమ్(16).  ప్రస్తుతం కివీస్ స్కోరు 200/5

2019-07-09 18:30:55

44వ ఓవర్లో తొలి సిక్సర్ కొట్టిన కివీస్ బ్యాట్స్​మన్

చాహల్ వేసిన 44వ ఓవర్ మొదటి బంతిని సిక్సర్​గా మలచి అర్ధశతకం పూర్తి చేశాడు టేలర్​. 73 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 191/4

2019-07-09 18:18:00

ఐదో వికెట్ కోల్పోయిన కివీస్​

43 ఓవర్లకు కివీస్ స్కోరు 179/4

42వ ఓవర్ వేసిన చాహల్ 8 పరుగులు ఇచ్చాడు. అనంతరం పాండ్య వేసిన 43వ ఓవర్లో ఓ ఫోర్​ సహా 9 పరుగులు వచ్చాయి. క్రీజులో టేలర్(44), గ్రాండ్ హోమ్(12) ఉన్నారు.

2019-07-09 18:13:08

కివీస్ బ్యాట్స్​మన్ నీషమ్ ఔట్​

పాండ్య వేసిన 41వ ఓవర్ చివరి బంతిని నీషమ్​(12) షాట్​కు యత్నించాడు. గాల్లో లేచిన బంతిని కార్తీక్ అందుకున్నాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 162/4

2019-07-09 18:12:31

40 ఓవర్లకు కివీస్ స్కోరు 155/3

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ నిదానంగా సాగుతోంది. 39వ ఓవర్ వేసిన భువి 6 పరుగులు ఇచ్చాడు. అనంతరం బుమ్రా వేసిన 40వ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. క్రీజులో రాస్ టేలర్(38), నీషమ్(7) ఉన్నారు.

2019-07-09 18:10:56

38 ఓవర్లకు కివీస్ స్కోరు 145/3

37వ ఓవర్ వేసిన భువనేశ్వర్ నాలుగు పరుగులు ఇచ్చాడు. అనంతరం పాండ్య వేసిన 38వ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. క్రీజులో రాస్ టేలర్(31), నీషమ్(4) ఉన్నారు. 

2019-07-09 18:02:16

35 ఓవర్లకు కివీస్ స్కోరు 133/2

34వ ఓవర్ వేసిన బుమ్రా మూడు పరుగులు ఇచ్చాడు. అనంతరం జడేజా వేసిన 35వ ఓవర్లో ఓ ఫోర్ సహా 8 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(67), రాస్ టేలర్(24) ఉన్నారు.

2019-07-09 17:55:20

33 ఓవర్లకు కివీస్ స్కోరు 122/2

33వ ఓవర్ వేసిన జడేజా ఒక్క పరుగే ఇచ్చాడు. డ్రింక్స్​ విరామానికి కివీస్​ రెండు వికెట్లు నష్టానికి 122 పరుగులు చేసింది. క్రీజులో విలియమ్సన్(58), రాస్ టేలర్(22) ఉన్నారు

2019-07-09 17:47:33

టేలర్ క్యాచ్ డ్రాప్​

బుమ్రా వేసిన 32వ బంతిని పుల్ చేయబోయాడు టేలర్. బంతి బ్యాట్​ ఎడ్జ్​ తీసుకుని కీపర్​ క్యాచ్ వెళ్లింది. అయితే ధోనీ క్యాచ్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం కివీస్ స్కోరు 122/2

2019-07-09 17:34:44

మూడో వికెట్ కోల్పోయిన కివీస్​

31 ఓవర్లకు కివీస్ స్కోరు 120/2

చాహల్ వేసిన 30వ ఓవర్లో ఓ ఫోర్​ కొట్టాడు టేలర్(22). పాండ్య వేసిన 31వ ఓవర్లో విలయమ్సన్ (56)మరో ఫోర్ కొట్టాడు. ఆ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి.

2019-07-09 17:33:10

విలియమ్సన్ అర్ధశతకం

కివీస్ కెప్టెన్ విలియమ్సన్ అర్ధశతకం చేశాడు. 79 బంతుల్లో 50 పరుగులు పూర్తి చేశాడు. ప్రస్తుతం 30 వ ఓవర్లకు రెండు వికెట్లు నష్టానికి 113 పరుగులు చేసింది న్యూజిలాండ్. 

2019-07-09 17:22:58

వంద పరుగులు దాటిన కివీస్​ స్కోరు

29వ ఓవర్ వేసిన పాండ్య 6 పరుగులు ఇచ్చాడు. క్రీజులో విలియమ్సన్(48), టేలర్(16) ఉన్నారు. ప్రస్తుతం స్కోరు 105/2

2019-07-09 17:20:06

28 ఓవర్లకు కివీస్ స్కోరు 99/2

27వ ఓవర్ వేసిన పాండ్య 4 పరుగులు ఇచ్చాడు. అనంతరం చాహల్ వేసిన 28వ ఓవర్లో 2 ఫోర్లు సహా 9 పరుగులు వచ్చాయి. క్రీజులో విలయమ్సన్(44), రాస్ టేలర్(15) ఉన్నారు. 

2019-07-09 17:14:29

రనౌట్ మిస్ 

26వ ఓవర్ మూడో బంతిని టేలర్ సింగిల్ కోసం తీశాడు. పరుగు తీసే సమయంలో చాహల్ త్రో వేయగా వికెట్లకు మిస్సై విలియమ్సన్ బతికిపోయాడు. ప్రస్తుతం 26 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 85 పరుగులు చేసింది కివీస్
 

2019-07-09 17:08:05

24 ఓవర్లకు కివీస్ స్కోరు 82/2

23వ ఓవర్లో జడేజా రెండు పరుగులే ఇచ్చాడు. అనంతరం చాహల్ వేసిన 24వ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(36), రాస్ టేలర్(6) ఉన్నారు

2019-07-09 17:06:30

22 ఓవర్లకు కివీస్​ స్కోరు 77/2

21వ ఓవర్ వేసిన జడేజా ఒక్క పరుగే ఇచ్చాడు. అనంతరం చాహల్ వేసిన 22వ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. ప్రస్తుతం క్రీజులో విలియమ్సన్(34), రాస్ టేలర్(3) ఉన్నారు. 

2019-07-09 17:01:18

19వ రెండో బంతికి కివీస్ బ్యాట్స్​మన్ నికోలస్(28) బౌల్డ్​ అయ్యాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 69/2

2019-07-09 16:54:20

17 ఓవర్లకు కివీస్​ స్కోరు 61/1

16వ ఓవర్ వేసిన పాండ్య రెండు వైడ్లు మినహా పరుగులేమి ఇవ్వలేదు. అనంతరం జడేజా వేసిన 17వ ఓవర్లో నాలుగు పరుగులు వచ్చాయి. క్రీజులో విలియమ్సన్(30), నికోలస్(26) ఉన్నారు

2019-07-09 16:47:15

2019-07-09 16:42:30

15 ఓవర్లకు కివీస్ స్కోరు 55/1

15వ ఓవర్ వేసిన జడేజా 3 పరుగులే ఇచ్చాడు. క్రీజులో విలియమ్సన్(27), నికోలస్(25) ఉన్నారు.

2019-07-09 16:36:02

14 ఓవర్లకు కివీస్ స్కోరు 52/1

పాండ్య వేసిన 14వ ఓవర్లో  ఓ ఫోర్ సహా 9 పరుగులు వచ్చాయి. క్రీజులో విలియమ్సన్(26), నికోలస్(23) నిలకడగా ఆడుతున్నారు. 

2019-07-09 16:29:00

రెండో వికెట్ కోల్పోయిన కివీస్​

13 ఓవర్లకు కివీస్ స్కోరు 44/1

12వ ఓవర్ వేసిన పాండ్య 4 పరుగులు ఇచ్చాడు. అనంతరం జడేజా వేసిన 13వ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. క్రీజులో విలియమ్సన్(21), నికోలస్(20) ఉన్నారు. 

2019-07-09 16:23:19

పవర్​ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసిన కివీస్​

ఈ వరల్డ్​కప్​లోనే పవర్​ ప్లేలో అత్యల్ప స్కోరు నమోదు చేసింది కివీస్​​. 10 ఓవర్లకు వికెట్ నష్టానికి 27 పరుగుల చేసింది కివీస్​. ఆ తర్వాత స్థానంలో భారత్​ 28/1(ఇంగ్లాండ్​పై) ఉంది. ప్రస్తుతం 11 ఓవర్లకు కివీస్​ వికెట్ నష్టానికి 34 పరుగులు చేసింది. 

2019-07-09 16:19:12

10 ఓవర్లో బౌలింగ్ మార్చిన భారత్​

వికెట్ నిలబెట్టుకుంటూ జాగ్రత్తగా ఆడుతోంది న్యూజిలాండ్​ .10వ ఓవర్ వేసిన హార్దిక్ పాండ్య 4 పరుగులు ఇచ్చాడు.  క్రీజులో విలియమ్సన్(14), నికోలసన్(10) ఉన్నారు. ప్రస్తుతం కివీస్ స్కోరు 27/1

2019-07-09 16:12:22

9వ ఓవర్లకు కివీస్ స్కోరు 23/1

8వ ఓవర్ చివరి బంతిని ఫోర్​గా మలిచాడు నికోలస్(10). భువి వేసిన 9వ ఓవర్లో ఇంకో ఫోర్​ కొట్టాడు విలియమ్సన్​(12)

2019-07-09 16:05:28

8 ఓవర్లకు కివీస్ స్కోరు 18/1

7వ ఓవర్ల్ వేసిన భువి రెండు పరుగులే ఇచ్చాడు. అనంతరం బుమ్రా వేసిన 8వ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. క్రీజులో విలియమ్సన్(7), నికోలస్​(10) ఉన్నారు. 

2019-07-09 15:58:07

6వ ఓవర్లో ఒక్క పరుగే ఇచ్చిన బుమ్రా

ఆరు ఓవర్లలో కివీస్ వికెట్ నష్టానికి 8 పరుగులు చేసింది. బుమ్రా ఒక్క పరుగే ఇచ్చాడు. క్రీజులో విలియమ్సన్(4), నికోలస్​(3) ఉన్నారు. 

2019-07-09 15:53:21

విలియమ్సన్​ ఇన్​...

తొలి వికెట్​ కోల్పోయి ఒత్తిడిలో పడిన జట్టును నడిపించేందుకు సారథి విలియమ్సన్​ క్రీజులోకి వచ్చాడు.  విలియమ్సన్​(3), హెన్రీ నికోలస్​(3) పరుగులతో క్రీజులో ఉన్నారు.

5 ఓవర్లుకు న్యూజిలాండ్​ స్కోరు- 7/1

2019-07-09 15:45:40

తొలి వికెట్​...

బుమ్రా వేసి నాలుగో ఓవర్​ 3వ బంతికి గప్తిల్​ పెవిలియన్​ చేరాడు. కోహ్లీ అద్భుతమైన క్యాచ్​తో కివీస్​ ఓపెనర్​ను ఔట్​ చేశాడు. ఫలితంగా ఒక్క పరుగు వద్దే తొలి వికెట్​ కోల్పోయింది. క్రీజులో మరో ఓపెనర్​ హెన్రీ (0) ఉన్నాడు.

3.3 ఓవర్లకు న్యూజిలాండ్​ స్కోరు- 1/1

2019-07-09 15:43:42

ఖాతా ఓపెన్​....

బ్యాటింగ్​ ఆరంభించిన కిివీస్​ బ్యాట్స్​మెన్లను భారత పేసర్లు భయపెడుతున్నారు. ఎట్టకేలకు మూడో ఓవర్లో ఖాతా తెరిచారు న్యూజిలాండ్​ బ్యాట్స్​మెన్​. 17వ బంతికి సింగిల్​ తీశాడు గప్తిల్​

3 ఓవర్లకు న్యూజిలాండ్​ స్కోరు- 1/0

2019-07-09 15:37:23

బుమ్రా మెయిడిన్​...

తొలి ఓవర్​ మెయిడిన్​గా ముగియగా... రెండో ఓవర్​ను టీమిండియా స్టార్​ పేసర్​ బుమ్రా ప్రారంభించాడు. పదునైన బంతులతో ప్రత్యర్థిని భయపెట్టిన జస్ప్రీత్​... ఈ ఓవర్​నూ మెయిడిన్​గా ముగించాడు.

2 ఓవర్లకు న్యూజిలాండ్​ స్కోర్​- 0/0

2019-07-09 15:30:15

తొలి బంతికే రివ్యూ...

గప్తిల్​ ఎదుర్కొన్న మొదటి బంతికే ఎల్బీగా ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తొలుత నాటౌట్​గా ప్రకటించినా టీమిండియా అప్పీల్​తో థర్డ్​ అంపైర్​ను సంప్రదించాడు అంపైర్​. కాని రివ్యూలో బంతి వికెట్లకు పక్కగా పోవడం వల్ల నాటౌట్​గా బతికిపోయాడు గప్తిల్​.

తొలి ఓవర్​ను మెయిడిన్​గా ముగించాడు భువనేశ్వర్​.

2019-07-09 15:23:16

సెమీఫైనల్​ పోరు ఆరంభం...

టాస్​ గెలిచిన న్యూజిలాండ్​ మొదట బ్యాటింగ్​ ఆరంభించింది. ఓపెనర్లుగా గప్తిల్​ బ్యాటింగ్​ ఎండ్​లో, హెన్రీ నికోలస్ నాన్​ ఎండ్​లో క్రీజులోకి దిగారు. తొలి ఓవర్​ భువనేశ్వర్​ కుమార్​ ప్రారంభించాడు.

2019-07-09 15:15:27

సెమీఫైనల్​-1 జట్లు ఇవే...

భారత్​:

కివీస్​తో జరుగుతున్న సెమీఫైనల్​ పోరులో జడేజాకు స్థానం దక్కగా షమి చోటు కోల్పోయాడు. స్పిన్నర్లలో చాహల్​ మాత్రమే తుది జట్టులో నిలిచాడు. కుల్దీప్​ యాదవ్​కు నిరాశ తప్పలేదు. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగింది టీమిండియా.

  • లోకేశ్​ రాహుల్​, రోహిత్​ శర్మ, విరాట్​ కోహ్లీ(సారథి), రిషభ్​ పంత్​, ధోనీ(కీపర్​), దినేశ్​ కార్తీక్​, హార్దిక్​ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్​ కుమార్​, యజువేంద్ర చాహల్​, జస్ప్రీత్​ బుమ్రా.

న్యూజిలాండ్​: 

కివీస్​ జట్టు ఒక్క మార్పుతోనే బరిలోకి దిగుతోంది. సౌథీ స్థానంలో ఫెర్గుసన్​ను తుది జట్టులోకి తీసుకుంది.

  • గప్తిల్​, హెన్రీ నికోలస్​, కేన్​ విలియమ్సన్​(సారథి), టేలర్​, టామ్​ లాథమ్​(కీపర్​), నీషమ్​, డీ గ్రాండ్​హోమ్​, సాంట్నర్​, ఫెర్గుసన్​, హెన్రీ, బౌల్ట్​

2019-07-09 15:11:39

ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా న్యూజిలాండ్​, భారత్​ జట్ల మధ్య తొలి సెమీఫైనల్​ మ్యాచ్​ జరుగుతోంది. టాస్​ గెలిచిన కివీస్​ జట్టు సారథి విలియమ్సన్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

2019-07-09 15:07:09

ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా న్యూజిలాండ్​, భారత్​ జట్ల మధ్య తొలి సెమీఫైనల్​ మ్యాచ్​ జరుగుతోంది. టాస్​ గెలిచిన కివీస్​ జట్టు సారథి విలియమ్సన్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

2019-07-09 15:00:41

ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా న్యూజిలాండ్​, భారత్​ జట్ల మధ్య తొలి సెమీఫైనల్​ మ్యాచ్​ జరుగుతోంది. టాస్​ గెలిచిన కివీస్​ జట్టు సారథి విలియమ్సన్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

2019-07-09 14:57:48

ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా న్యూజిలాండ్​, భారత్​ జట్ల మధ్య తొలి సెమీఫైనల్​ మ్యాచ్​ జరుగుతోంది. టాస్​ గెలిచిన కివీస్​ జట్టు సారథి విలియమ్సన్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

2019-07-09 14:37:08

ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా న్యూజిలాండ్​, భారత్​ జట్ల మధ్య తొలి సెమీఫైనల్​ మ్యాచ్​ జరుగుతోంది. టాస్​ గెలిచిన కివీస్​ జట్టు సారథి విలియమ్సన్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

2019-07-09 14:28:10

ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా న్యూజిలాండ్​, భారత్​ జట్ల మధ్య తొలి సెమీఫైనల్​ మ్యాచ్​ జరుగుతోంది. టాస్​ గెలిచిన కివీస్​ జట్టు సారథి విలియమ్సన్​ బ్యాటింగ్​ ఎంచుకున్నాడు.

Last Updated : Jul 9, 2019, 11:21 PM IST

ABOUT THE AUTHOR

...view details