2011 ప్రపంచకప్... సొంత గడ్డపై వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 58 పరుగులకే కుప్పకూలింది. ఇది ప్రపంచకప్‌లో అత్యంత తక్కువ స్కోర్లలో ఒకటి. ఈ మ్యాచ్ ఆ దేశ ప్రజల్లో ఆగ్రహావేశాలు తెప్పించింది. ఫలితంగా బంగ్లాదేశ్‌లోని ఢాకాలో వెస్టిండీస్ క్రికెటర్ల బస్సుపై రాళ్లతో దాడి చేశారు కొంత మంది అభిమానులు.
ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు జునైద్ సిద్దిఖీ, అష్రాఫుల్ మినహా ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేదు. నలుగురు ఆటగాళ్లు(తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్ రహీమ్, షఫుల్ ఇస్లామ్, రూబెల్) డకౌట్లుగా వెనుదిరిగారు. కెప్టెన్ షకీబుల్ అల్ హసన్ కూడా నిరాశపరిచాడు. తక్కువ లక్ష్యాన్ని చేధించి 9 వికెట్లతో విజయం సాధించింది విండీస్. 226 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సొంతం చేసుకోవడం విశేషం.