ఎన్నో రోజుల పాటు సాగిన క్రికెట్ ప్రపంచకప్ ముగిసింది. ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది. టీమిండియా సెమీఫైనల్లోనే నిష్క్రమించింది. కానీ సీజన్లో అత్యధిక పరుగులు చేసిన రోహిత్ శర్మ.. త్వరలో గోల్డెన్ బ్యాట్ అందుకోనున్నాడు. ఈ ఘనతను పొందే మూడో భారత క్రికెటర్గా రికార్డు సృష్టించనున్నాడు.
రోహిత్ కంటే ముందు సచిన్ (1996, 2003), రాహుల్ ద్రావిడ్ (1999) ఈ రికార్డు సాధించారు. ఈ ప్రపంచకప్‌లో ఐదు సెంచరీలు బాదిన రోహిత్.. 81 సగటుతో 648 పరుగులు చేశాడు. ఒకే సీజన్లో అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు.