డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ అవకాశాలను మెరుగుపరుచుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిన ఆసీస్ అమ్మాయిలు.. ఆ తర్వాత శ్రీలంకపై నెగ్గారు. తాజాగా మూడో మ్యాచ్‌లోనూ బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది. ఫలితంగా గ్రూప్-ఎ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది.
కాన్‌బెర్రా వేదికగా గురువారం జరిగిన గ్రూప్-ఎ పోరులో... ఆసీస్ జట్టు 86 పరుగలు తేడాతో బంగ్లాపై ఘనవిజయం సాధించింది. కంగారూ జట్టు బ్యాట్స్‌వుమన్ అలీసా హీలీ (83), బెత్ మూనీ (81 నాటౌట్) సత్తా చాటారు.