తెలంగాణ

telangana

ETV Bharat / sports

విండీస్​తో సఫారీల ఢీ- దక్షిణాఫ్రికా బోణీ కొట్టేనా?

ప్రపంచకప్​ ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా హ్యాట్రిక్​ ఓటములతో డీలాపడింది. నేడు సౌతాంప్టన్​ వేదికగా వెస్టిండీస్​తో తలపడనుంది సఫారీ జట్టు. బలమైన ప్రత్యర్థితో పోటీపడుతున్న ప్రోటీస్ ఈ మ్యాచ్​లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ్యాచ్​  మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

విండీస్ ఫామ్​ను సఫారీలు నిలువరించేనా..?

By

Published : Jun 10, 2019, 8:00 AM IST

దక్షిణాఫ్రికా ఈ ప్రపంచకప్‌లో ఇప్పటిదాకా బోణీ కొట్టలేదు. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. సెమీస్‌ అవకాశాలు సంక్లిష్టం కాకుండా ఉండాలంటే వెస్టిండీస్‌పై గెలవడం సఫారీలకు తప్పనిసరి. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక మ్యాచ్‌ గెలిచి.. మరో మ్యాచ్‌లో ఓడిన విండీస్‌.. దక్షిణాఫ్రికాపై గెలవాలనే పట్టుదలతో ఉంది.

వర్ష ప్రభావం...

సౌథాంప్టన్‌లో చాలా చలితో కూడిన వాతావరణం ఉంది. 70 శాతం మబ్బు పట్టి ఉంది. వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి.
సౌతాంప్టన్​లోని రోస్​ బౌల్​​ మైదానం బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అందుకే ఈ పిచ్‌పై పరుగుల వరద ఖాయం. ఒకవేళ వర్షం కురిస్తే పిచ్‌ నెమ్మదించే అవకాశాలున్నాయి.

పదునైన బౌలింగ్​...

ఈ మెగాటోర్నీలో విండీస్ పేసర్లు ఆకట్టుకుంటున్నారు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్ జాసన్ హోల్డర్, రస్సెల్, థామస్ విజృంభణతో పాకిస్థాన్ 105 పరుగులకే కుప్పకూలింది.
ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లో బ్రాత్‌వైట్, కార్టెల్ వికెట్లు పడగొట్టి కట్టడి చేసినా.. బ్యాటింగ్​లో విఫలమై 15 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. హిట్టర్లతో బలంగా ఉన్న విండీస్ తొలి మ్యాచ్‌ను ఆడుతూ పాడుతూ ఛేదించేసింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై విండీస్​ బ్యాట్స్​మెన్​ షై హోప్, హోల్డర్ రాణించినా స్వల్ప తేడాతో పరాజయం పాలైంది. కరీబియన్​ బ్యాట్స్​మెన్లు పేస్​ బౌలింగ్​ ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు.

ప్రొటీస్​కు కష్టాలు..

పేస్‌కు పెట్టింది పేరైన సఫారీ బౌలర్లు టోర్నీలో పేలవ ప్రదర్శన చేస్తున్నారు. ఇంగ్లాండ్‌తో మ్యాచ్​లో ఘోరంగా విఫలమైన దక్షిణాఫ్రికా బౌలింగ్​ విభాగం.. బంగ్లా బ్యాట్స్​మెన్లను కట్టిడిచేయలేకపోయారు. భారత్‌తో జరిగిన మూడో మ్యాచ్‌లో కాస్త ఫర్వాలేదనిపించింది. ఐపీఎల్​లో హడలెత్తించిన రబాడ ఈ గ్రాండ్​ వేదికపై చతికిలపడుతున్నాడు. డీకాక్​, డస్సెన్​, డుప్లెసిస్​ కొంత మేర రాణిస్తున్నా పూర్తి స్థాయి ప్రదర్శన కనబరచలేకపోతున్నారు.

నువ్వా-నేనా..

  1. ఇప్పటివరకు దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ 61 వన్డేలు ఆడాయి. వాటిలో సఫారీ జట్టు 44 గెలవగా.. విండీస్‌ 15 మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్‌ టై అయ్యింది. మరో మ్యాచ్‌ రద్దయింది.
  2. ప్రపంచకప్‌లో విండీస్‌, దక్షిణాఫ్రికా ఆరుసార్లు తలపడగా.. సఫారీ జట్టు నాలుగుసార్లు, విండీస్‌ రెండుసార్లు విజయం సాధించాయి.

భారీ హిట్టర్లు, పటిష్ఠమైన పేస్ దళం ఉన్న విండీస్‌ను.. పుంజుకోవాలని ఆశతో ఉన్న దక్షిణాఫ్రికా నిలువరిస్తుందో లేదో చూడాలి.

ABOUT THE AUTHOR

...view details