తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: 'అంపైర్ నిర్ణయాలు దారుణం' - విండీస్

నాటింగ్​హామ్ వేదికగా ఆసీస్​తో జరిగిన మ్యాచ్​లో విండీస్ ఆటగాడు కార్లోస్ బ్రాత్​వైట్​ అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. అంపైర్ల​ తప్పిదాల వల్ల మ్యాచ్​ స్వరూపం మారిపోయిందని తెలిపాడు.

బ్రాత్​వైట్​

By

Published : Jun 7, 2019, 4:32 PM IST

ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో అంపైర్ల నిర్ణయాలపై అసంతృప్తి వ్యక్తం చేశాడు వెస్టిండీస్ ఆటగాడు కార్లోస్​ బ్రాత్​వైట్. ఓపెనర్ క్రిస్​గేల్, జాసన్ హోల్డర్​లను రెండు సార్లు ఔట్​గా ప్రకటించారని.. అయితే రివ్యూలో నాటౌట్​గా తేలిందని చెప్పాడు. విండీస్​ దిగ్గజం మైఖేల్​ హోల్డింగ్​ కూడా అంపైర్​ నిర్ణయాలను తప్పుబట్టాడు.

"ఆసీస్ మ్యాచ్​లో అంపైర్ నిర్ణయాలు దారుణంగా ఉన్నాయి. మేము బౌలింగ్​ చేసినప్పుడు కూడా బంతి కొంచెం ఎత్తుగా వెళ్తే వైడ్​ ఇచ్చారు. క్రిస్​ గేల్ లాంటి బ్యాట్స్​మన్ అంపైర్ నిర్ణయం వల్ల మూడు సార్లు రివ్యూ తీసుకున్నాడు. 289 లక్ష్య ఛేదనలో అతనొక్కడే మ్యాచ్​ మలుపు తిప్పగల సమర్థుడు". -కార్లోస్ బ్రాత్​వైట్​, విండీస్ ప్లేయర్​

గురువారం ఆసీస్​తో జరిగిన మ్యాచ్​లో క్రిస్​గేల్ 17 బంతుల్లో 21 పరుగులు చేసి ఔటయ్యాడు. అప్పటికే 4 బౌండరీలతో ఊపుమీదున్న అతడు స్టార్క్​ బౌలింగ్​లో ఎల్బీగా వెనుదిరిగాడు. అంతకుముందు రెండు సార్లు అంపైర్లు గేల్​ను ఔట్​గా ప్రకటించగా రివ్యూ కోరి సఫలమయ్యాడు. అనంతరం 5వ ఓవర్లో స్టార్క్ మళ్లీ యార్కర్​ వేయగా.. బంతి ప్యాడ్లను తగిలింది. అంపైర్ ఔట్​గా ప్రకటించాడు. గేల్ మళ్లీ సమీక్ష తీసుకున్నాడు. అయితే అంపైర్స్ కాల్​ నిర్ణయంతో గేల్​ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.

దీనికి ముందు బంతిని స్టార్క్ నోబాల్ వేశాడు. ఈ విషయం టీవీ రిప్లేలో తేలింది. అంపైర్ ఈ విషయం గుర్తించినట్లయితే ఫ్రీ హిట్ వచ్చేదే. గేల్ ఔట్ కాకుండా ఉండేవాడు.

ఇది చదవండి: WC19: అఫ్గాన్​కు దెబ్బ- టోర్నీకి షెహజాద్​ దూరం

ABOUT THE AUTHOR

...view details