తెలంగాణ

telangana

ETV Bharat / sports

గప్తిల్​ రికార్డు బ్రేక్​ చేసిన కేన్ విలియమ్సన్​ - worldcup

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఓ ప్రపంచకప్​లో ఆ దేశం తరఫున ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. భారత్​తో జరుగుతున్న మ్యాచ్​లో అర్ధశతకం సాధించిన విలియమ్సన్​ 548 పరుగులతో గప్తిల్(547)ను వెనక్కినెట్టాడు.

కేన్ విలియమ్సన్

By

Published : Jul 9, 2019, 8:07 PM IST

భారత్​తో జరుగుతున్న ప్రపంచకప్​ సెమీస్ మ్యాచ్​లో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అరుదైన ఘనత సాధించాడు. ఓ వరల్డ్​కప్​లో కివీస్ తరఫున అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు. ఈ ప్రపంచకప్​లో 548 పరుగులు చేసి గప్తిల్ రికార్డును బద్దలు కొట్టాడు. 2015 వరల్డ్​కప్​లో గప్తిల్ 547 పరుగులు చేశాడు.

భారత్​తో జరుగుతున్న మ్యాచ్​లో నిలకడగా ఆడి 67 పరుగులు చేశాడు విలియమ్సన్​. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. ఈ మెగాటోర్నీలో 91.33 సగటుతో 548 పరుగులతో ఎక్కువ వ్యక్తిగత స్కోరు చేసిన ఆటగాళ్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇందులో రెండు శతకాలు, 4 అర్ధశతకాలు ఉన్నాయి.

మాంచెస్టర్ వేదికగా జరగుతున్న మ్యాచ్​లో 67 పరుగులు చేసి చాహల్ బౌలింగ్​లో ఔటయ్యాడు విలయమ్సన్​.

ఇది చదవండి: ఇన్నింగ్స్ చివర్లో వరణుడి రాక.. కివీస్@211/5

ABOUT THE AUTHOR

...view details