తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: విలియమ్సన్​ ఖాతాలో అరుదైన రికార్డు

క్రికెట్ ప్రపంచకప్​లో న్యూజిలాండ్​ కెప్టెన్ విలియమ్సన్.. ఓ సీజన్​లో అత్యధిక పరుగులు చేసిన సారథిగా నిలిచాడు. 2019 వరల్డ్​కప్​లో 578 పరుగులు చేసిన ఈ క్రికెటర్.. మహేలా జయవర్ధనే (548) రికార్డును అధిగమించాడు.

విలియమ్సన్​ ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు

By

Published : Jul 15, 2019, 5:47 AM IST

ప్రపంచకప్​ ఫైనల్​లో ఓడినా అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు కివీస్ కెప్టెన్ విలియమ్సన్. మ్యాన్ ఆఫ్ ది సిరీస్​తో పాటు ఓ ప్రపంచకప్​లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్​గా ఘనత సాధించాడు. న్యూజిలాండ్​కు సారథ్యం వహించిన కేన్ విలియమ్సన్.. మొత్తంగా 578 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్

ఈ రికార్డు ఇంతకు ముందు శ్రీలంక మాజీ కెప్టెన్ మహేలా జయవర్ధనే పేరిట ఉంది. 2007 ప్రపంచకప్​లో జయవర్థనే 548 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమం. ఈ రికార్డ్​ తిరగరాశాడు కివీస్ కెప్టెన్.

ఈ జాబితాలో రికీ పాంటింగ్ (2007- 539 పరుగులు), ఫించ్ (2019- 507 పరుగులు), డివిలియర్స్ (2015- 482 పరుగులు), సౌరవ్ గంగూలీ (2003- 465 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఇది చదవండి: 'సూపర్'​ థ్రిల్లర్​ మ్యాచ్​లో విశ్వవిజేతగా ఇంగ్లాండ్​

ABOUT THE AUTHOR

...view details