తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆ సిక్స్​ చూసి ప్రాణాలు విడిచిన నీషమ్​ కోచ్​​

ఇంగ్లాండ్​తో ప్రపంచకప్​ ఫైనల్ జరిగిన రోజే కివీస్ ఆల్​రౌండర్ నీషమ్ స్కూల్ కోచ్ డేవిడ్ గోర్డాన్ మరణించారు. సూపర్ ​ఓవర్లో నీషమ్​ సిక్సర్​ కొట్టినపుడే తన చివరి శ్వాస విడిచారని డేవిడ్ కూతురు లియోని తెలిపింది. అనంతరం తన కోచ్​కు ట్విట్టర్లో నివాళులర్పించాడు నీషమ్.

నీషమ్

By

Published : Jul 18, 2019, 1:53 PM IST

ఇంగ్లాండ్​తో జరిగిన ప్రపంచకప్​ ఫైనల్​ సూపర్ ​​ఓవర్లో న్యూజిలాండ్ ఆల్​రౌండర్​ జిమ్మీ నీషమ్ కొట్టిన సిక్స్​ను అంత త్వరగా మర్చిపోలేం. ఆ షాట్​ చూసే నీషమ్ స్కూల్ కోచ్ డేవిడ్ గోర్డాన్ తన తది శ్వాస విడిచారంట. ఈ విషయాన్ని గోర్డాన్ కూతురు లియోని తెలిపింది.

ప్రపంచకప్​ ఫైనల్​ రోజే నీషమ్ కోచ్​ గోర్డాన్ గుండెపోటుతో మరణించారు. నీషమ్ సిక్సర్ అనంతరం తన తండ్రి శ్వాసలో మార్పు వచ్చినట్టు నర్సు తెలిపిందని లియోని చెప్పింది.

"సూపర్ ​ఓవర్ జరుగుతున్నప్పుడు నర్సు హఠాత్తుగా బయటకు వచ్చింది. మా నాన్న శ్వాసలో మార్పు వచ్చిందని తెలిపింది. నీషమ్ సిక్సర్​ కొట్టినపుడే తన చివరి శ్వాస తీసుకుని ఉంటాడని నేను అనుకున్నా" -లియోని, డేవిడ్ గోర్డాన్ కూతురు

తన అక్లాండ్ గ్రామర్ టీచర్​(డేవిడ్ గోర్డాన్)కు ట్విట్టర్ వేదికగా నివాళులర్పించాడు నీషమ్.

"కోచ్​గా, స్నేహితుడిగా మీరు అందించిన సహాయం మర్చిపోలేనిది. ఆట పట్ల మీకున్న ప్రేమ ఎంతో ఆదర్శనీయం. ముఖ్యంగా మీ పర్యవేక్షణలో ఆడటం నా అదృష్టం. మీరు గర్వపడేలా ఆడానని అనుకుంటున్నా" -జిమ్మీ నీషమ్

ఇంగ్లాండ్​తో జరిగిన ఫైనల్ మ్యాచ్​లో న్యూజిలాండ్ బౌండరీ కౌంట్​ ద్వారా ప్రపంచకప్​ను చేజార్చుకుంది. సూపర్ ​ఓవర్లో నీషమ్ ఓ సిక్సర్​ సహా 14 పరుగులు చేశాడు.

ఇది చదవండి: 2022 ఫిఫా ప్రంపచకప్​లో భారత్​కు భలే ఛాన్స్​!

ABOUT THE AUTHOR

...view details