మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా విండీస్‌తో మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. కోహ్లీ, ధోనీ అర్ధశతకాలతో రాణించగా... రాహుల్ 48 పరుగులు చేసి మంచి సహకారం అందించాడు. చివర్లో పాండ్య బ్యాట్ ఝుళిపించాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ప్రారంభంలోనే రోహిత్ శర్మ (18) వికెట్ కోల్పోయింది. అనంతరం రాహుల్, కోహ్లీ కాసేపు విండీస్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించారు. రాహుల్ కొద్దిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకుని 48 పరుగుల వద్ద ఔటయ్యాడు. బాధ్యతాయుతంగా ఆడిన కోహ్లీ 82 బంతుల్లో 72 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో విరాట్‌కిది వరుసగా నాలుగో అర్ధసెంచరీ.