ప్రపంచకప్‌లో టాంటన్ వేదికగా బంగ్లాతో జరిగిన పోరులో కరీబియన్లుప్రత్యర్థి ముందుభారీ లక్ష్యం ఉంచారు. హోప్ తృటిలో శతకం మిస్సవ్వగా... లూయిస్, హిట్మైర్ అర్ధశతకాలు చేశారు. మిడిలార్డర్లో వచ్చిన పూరన్, జాసన్ హోల్డర్ బ్యాట్ ఝులిపించారు. హార్డ్ హిట్టర్లు క్రిస్ గేల్, రసెల్ డకౌట్లుగా వెనుదిరిగారు. ఫలితంగా 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 321 పరుగులు చేసింది వెస్టిండీస్.
మొదట బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. హిట్టర్ గేల్ 13 బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. తర్వాత జోరు తగ్గిన విండీస్ ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టాడు హోప్.
హోప్ రక్షించాడు..
ఓపెనర్ గేల్ నిష్క్రమణతో క్రీజులోకి వచ్చిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ షాయ్ హోప్ నెమ్మదిగా పరుగులు రాబట్టి 121 బంతుల్లో 96 పరుగులు( 4 ఫోర్లు, సిక్స్) సాధించాడు. చెత్త షాట్ ఆడి తృటిలో శతకం చేజార్చుకున్న హోప్... వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో కీలకంగా నిలిచాడు. అవతలి ఎండ్‌లో ఆటగాళ్లు వచ్చి వెంటనే పెవిలియన్ చేరుతున్నా... క్రీజులో పాగా వేసి మంచి ఇన్నింగ్స్ నిర్మించాడు. ఈ ప్రపంచకప్‌లో రెండో సారి 50 పరుగుల వ్యక్తిగత మార్కు దాటాడు.ఫలితంగా బంగ్లాకు 322 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించారు.
బోర్డర్లు దాటిన సిక్సర్లు...