ప్రస్తుతం ప్రపంచకప్ సెమీస్ రేసులో ఉన్న జట్లలో పాకిస్థాన్ ఒకటి. తుది నాలుగు స్థానాల్లో చోటు కోసం శ్రమిస్తోంది. అయితే సెమీస్లోకి ప్రవేశిస్తే మాత్రం సర్ఫరాజ్ సేన ఇతర జట్లకు ప్రమాదకరంగా మారుతుందని చెప్పాడు ఆ దేశ మాజీ ఆటగాడు వకార్ యూనిస్. బంగ్లాదేశ్తో ఆడే చివరి లీగ్ మ్యాచ్లో గెలిచి టాప్-4లో చోటు దక్కించుకుంటుందని అన్నాడీ ఆటగాడు.
"ఇప్పుడు కొంచెం ఆసక్తిగా ఉంది. పాక్ జట్టు చరిత్ర తిరగరాస్తుందని అనుకుంటున్నా. పాకిస్థాన్ సెమీస్లో ప్రవేశిస్తుందో లేదో తెలియదు. ఒకవేళ వెళ్తే మాత్రం వారితో ప్రమాదమే. చివరి లీగ్ మ్యాచ్లో బంగ్లాపై కచ్చితంగా గెలిచి తీరాలి." -వకార్ యూనిస్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్
మిగతా మ్యాచ్ల్లో గెలవాలంటే జట్టులో కొన్ని మార్పులు చేయాలని మేనేజ్మెంట్కు సూచించాడీ మాజీ ఆటగాడు.