తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆ ఆరు పరుగులు అంపైర్ల తప్పిదమే'

ప్రపంచకప్​ ఫైనల్లో అంపైర్ తీసుకున్న నిర్ణయంపై మాజీ అంపైర్ టఫెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వారు తీసుకున్న నిర్ణయం సరైనది కాదని తెలిపాడు.

మ్యాచ్

By

Published : Jul 15, 2019, 7:29 PM IST

ప్రపంచకప్ సమరం ముగిసింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగింది. తుదిపోరులో మోర్గాన్ సేన కివీస్​పై విజయం సాధించింది. అయితే ఇక్కడ సమస్యంతా వారు గెలిచిన తీరులోనే ఉంది. ఐసీసీ దారుణ నిబంధనల ఫలితంగా ఇంగ్లాండ్ వరల్డ్​కప్ గెలిచిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అంపైర్ల తప్పుడు నిర్ణయాలూ కివీస్ ఓటమికి కారణమని ఆ దేశ మీడియా మండిపడింది.

తప్పిదం జరిగిందిలా..

ఇంగ్లాండ్​ ఇన్నింగ్స్ చివరి ఓవర్. విజయానికి మూడు బంతుల్లో తొమ్మిది పరుగులు అవసరం. బెన్ స్టోక్స్ బ్యాటింగ్. బౌల్ట్ బౌలింగ్. బంతిని లెగ్​ సైడ్​లో ఆడాడు స్టోక్స్. గప్తిల్ బంతిని కీపర్ వైప్ విసిరాడు. కానీ అది రెండో పరుగు కోసం డైవ్ చేస్తున్న స్టోక్స్ బ్యాట్​ను తాకి ఫోర్ వెళ్లింది. ఫలితంగా అంపైర్ ధర్మసేన ఆరు పరుగులు ఇచ్చాడు.
ఈ ఆరు పరుగులే సూపర్ ఓవర్​కు దారితీశాయి. ఇంగ్లాండ్ తొలి ప్రపంచకప్​ విజయానికి కారణమయ్యాయి.

న్యూజిలాండ్ మీడియా ఓవర్ త్రోగా ఆరు పరుగులు ఇవ్వడాన్ని తప్పుపట్టింది. ఇదే విషయంపై మాజీ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్ సైమన్ టఫెల్ స్పందించాడు.

టఫెల్

అంపైర్ నిర్ణయం తప్పు. ఎంసీసీ నిబంధనలకు విరుద్ధంగా అధిక పరుగులు ఇచ్చారు.
-టఫెల్, మాజీ అంపైర్

ఎంసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి ?

ఓవర్ త్రో ద్వారా బౌండరీకి వెళితే.. ఆ పరుగులతో పాటు ఫీల్డర్‌ యాక్షన్‌ పూర్తయ్యే సమయానికి బ్యాట్స్‌మెన్‌ తీసిన పరుగులను కూడా కలిపి ఇవ్వాలి.
అయితే స్టోక్స్‌, రషీద్‌లు రెండో పరుగు పూర్తి చేయకుండానే బంతి స్టోక్స్‌ బ్యాట్‌ తాకి బౌండరీకి వెళ్లింది. బౌండరీ ద్వారా లభించిన 4 పరుగులకు.. వారు చేసిన ఒక్క పరుగును జోడించి ఐదు పరుగులు ఇవ్వాలి. అంపైర్లు గుర్తించకుండా 6 పరుగులిచ్చారు.

ఇవీ చూడండి.. WC19: ఐసీసీ ప్రపంచకప్​ జట్టు ఇదే...!

ABOUT THE AUTHOR

...view details