ఈటీవీ భారత్‌తో మయాంక్ అగర్వాల్ ముఖాముఖి గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరమయ్యాడు విజయ్ శంకర్. అతడి స్థానంలో ఆడే అవకాశం దక్కించుకున్నాడు యువ ఆటగాడు మయాంక్ అగర్వాల్. ప్రతిరోజు తన ఆటను మెరుగుపరుచుకుంటానని చెప్పాడీ క్రికెటర్. ఐపీఎల్లో విదేశీ ఆటగాళ్లతో కలిసి ఆడటం తనకెంతో ఉపయోగపడిందని అన్నాడు. మరెన్నో విషయాల్ని ఈటీవీ భారత్‌తో పంచుకున్నాడు.
28 ఏళ్ల మయాంక్ అగర్వాల్.. ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అందులో ఆడిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 76, 42 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
గత 24 నెలల్లో లిస్ట్-ఏ క్రికెట్లో 1747 పరుగులు చేశాడు మయాంక్ అగర్వాల్. ఇంగ్లాండ్ పరిస్థితుల్లోనూ ఆడిన అనుభవముంది. ఆ దేశంలో ఆడిన 6 మ్యాచుల్లో 88.40 సగటుతో 442 పరుగులు సాధించాడీ క్రికెటర్. అందులో 3 సెంచరీలు ఉన్నాయి.
ప్రపంచకప్ నుంచి గాయం కారణంగా వైదొలగిన విజయ్ శంకర్.. టోర్నీలో ఇప్పటివరకు ఆడిన మ్యాచుల్లో మొత్తం 58 పరుగులే చేశాడు. రెండు వికెట్లు తీశాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వేసిన తొలి బంతికి వికెట్ సాధించాడు.
టీమిండియా క్రికెటర్ విజయ్ శంకర్ ఇది చదవండి: ప్రపంచకప్ నుంచి విజయ్ శంకర్ ఔట్