తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: 'ధోనీ రనౌట్ మా అదృష్టం...!' - dhoni

ధోనీ రనౌట్ అవ్వడం తమకు కలిసొచ్చిందని.. అలా జరగడం తమ అదృష్టమని తెలిపాడు న్యూజిలాండ్ ఆటగాడు గప్తిల్. అతడు వేసిన త్రోకే మహీ పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది.

గప్తిల్

By

Published : Jul 12, 2019, 6:49 PM IST

సెమీస్​ మ్యాచ్​లో భారత బ్యాట్స్​మన్ మహేంద్రసింగ్ ధోనీ రనౌట్​పై న్యూజిలాండ్ ఆటగాడు మార్టిన్ గప్తిల్ స్పందించాడు. ఆ రనౌట్​ మ్యాచ్​ను మలుపు తిప్పిన సంఘటన అని, అలా జరగడం తమ అదృష్టమని ఆనందం వ్యక్తం చేశాడు.

49వ ఓవర్లో గప్తిల్ వేసిన త్రో వల్లనే మహీ రనౌట్​గా వెనుదిరిగాడు.

"అసలు బంతి నా వద్దకు వస్తుందని అనుకోలేదు. వీలైనంత త్వరగా బంతిని కీపర్​ దగ్గరకు పంపిద్దామనుకున్నా. వికెట్లకు సూటిగా విసిరాను. అదృష్టవశాత్తు అతడు(ధోనీ) క్రీజులోకి రాకముందే బంతి వికెట్లను పడేసింది. ధోనీ ఔటవ్వడం మా జట్టుకు అదృష్టమే. - మార్టిన్ గప్తిల్, న్యూజిలాండ్ బ్యాట్స్​మన్.

ఈ రనౌట్​కు సంబంధించి ఐసీసీ పోస్ట్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది.

న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్​లో ధోనీ 72 బంతుల్లో 50 పరుగులు చేసి రనౌట్​గా వెనుదిరిగాడు. జడేజాతో కలిసి 116 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. అయితే ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్​లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఇది చదవండి: విజేందర్​ X స్నైడర్.. సూపర్​ ఫైట్​కు సర్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details